రాష్ట్రీయం

హోదా ఖాయమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కేంద్రం గుట్టుచప్పుడు కాకుండా క్షేత్రస్థాయి సాంకేతిక పరిశీలన జరిపిస్తోంది. ఇందుకోసం కడప జిల్లాను పైలట్ జిల్లాగా ఎంపిక చేసింది. క్షేత్రస్థాయిలో ప్రజలతో చర్చలు జరిపి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నివేదిక ఆధారంగా తుది నిర్ణయానికి రానుంది. ఈ క్రమంలోనే కేంద్ర న్యాయశాఖా మంత్రి సదానంద గౌడను రాష్ట్ర పర్యటనకు పంపించింది. కేవలం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశానికే పరిమితం కాకుండా మిగిలిన అవసరాలను కూడా అధ్యయనం చేయమని సూచించింది. ప్రధానంగా హైకోర్టు ఏర్పాటు విషయంలోనూ అంతర్గత అధ్యయనం చేయమని సూచించింది. అదనంగా హైకోర్టు బెంచి ఏర్పాటు చేయాల్సి వస్తుందా? అనే విషయంపైనా కేంద్రం పరిశీలనలు చేయించింది. కేంద్రం ఆదేశాలతో మంత్రి కడప జిల్లాలో పర్యటించి పార్టీ నాయకులతో, అధికారులతో, ప్రజలతో సంభాషించారు. నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పరిశీలనలో ఉందని కేంద్ర న్యాయశాఖా మంత్రి సదానంద గౌడ ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రభుత్వ పనితీరు, ప్రజల అవసరాలపై అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ తనకు సూచించారని, ఈమేరకు తాము కడప పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎంచుకుని క్షేత్రస్థాయిలో పర్యటించామని సదానందగౌడ చెప్పారు. ఉపాధి కోసం కడప జిల్లా ప్రజలు ఎక్కువగా వలసలు పోతున్నారని, కర్నాటక రాష్ట్రంలో కూడా కడప జిల్లా ప్రజలు అత్యధికంగా ఉన్నారని, కడప జిల్లాలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచాల్సి ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కడప ఉక్కు పరిశ్రమ స్థాపన కొన్ని సాంకేతిక కారణాలతో నిలిచిపోయిందని, పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని వివరించారు. మూడు రోజులుగా విస్తృత పర్యటనలు జరిపిన కేంద్ర మంత్రి సదానంద గౌడ అనేక అంశాలను పరిశీలించినట్టు తెలుస్తోంది. మరోపక్క వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ ప్రకటిస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో, ఈ కోణంలోనూ కడప జిల్లాను పరిశీలించినట్టు కేంద్ర మంత్రే ప్రకటించారు. కేంద్ర బడ్జెట్ సమావేశాలకు ముందే ప్రధాని నరేంద్ర మోదీనుంచి ఒక ప్రకటన ఉంటుందని కూడా కేంద్ర మంత్రి స్పష్టంగా ప్రకటించటంతో రాష్టవ్రాసుల్లో హోదాపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ప్యాకేజీ అయినా, ప్రత్యేక హోదా అయినా రాష్ట్రం మొత్తానికి ఉంటుందా? లేక వెనుకబడిన జిల్లాలుగా ఎంపిక చేసే ప్రాంతాలకే పరిమితమవుతుందా? అన్నది వేచి చూడాల్సి ఉంది.
chitram..
కడప నగర సమీపంలోని ఆలంఖాన్‌పల్లెలో శనివారం నిర్వహించిన జన్మభూమి- మాఊరు గ్రామసభలో మహిళలకు చెక్కులు అందిస్తున్న సిఎం చంద్రబాబు