ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రానికి డెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డేటా సెంటర్ ఏర్పాటుకు సిద్ధం చంద్రబాబుకు సంస్థ హామీ హెలికాప్టర్ల తయారీ యూనిట్ ఏర్పాటు యోచనలో బెల్
స్థలం లీజుకిస్తే కంపెనీలు స్థాపిస్తాం ముందుకొచ్చిన ప్రవాసాంధ్రులు డల్లాస్‌లో సిఎం పర్యటన

అమరావతి, మే 7:ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రఖ్యాత డెల్ కంపెనీ హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన అమెరికా పర్యటనలో భాగంగా ఆదివారం మూడోరోజు డెల్ కంపెనీ ప్రతినిధి శ్రీకాంత్ సత్యతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతి లేదా రాష్ట్రంలో మరే ప్రాంతంలోనైనా డేటా సెంటర్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. కాగా బెల్ హెలికాప్టర్ కంపెనీ డైరెక్టర్ చాద్ స్పార్క్స్ ఏపీలో మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్టు ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో తెలిపారు. పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ఏవియేషన్ పాలసీని ఇప్పటికే తీసుకొచ్చామని చెప్పిన చంద్రబాబు తమ రాష్ట్రానికి వచ్చి అధికారులతో సంప్రదింపులు జరపాల్సిందిగా బెల్ డైరెక్టర్‌ను ఆహ్వానించారు.
ఇదిలాఉండగా అమెరికాలో ఐటి సంస్థలు నిర్వహిస్తున్న ప్రవాసాంధ్రులతోనూ చంద్రబాబు డల్లాస్‌లో భేటీ అయ్యారు. ఐటీ సేవల రంగంలో పేరొందిన ప్రవాస తెలుగువారు అమెరికాలో 28కి పైగా సంస్థలు నిర్వహిస్తున్నారు. అమరావతి, విశాఖ నగరాల్లో లీజు ప్రాతిపదికన కేటాయించిన స్థలాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమని వారు వెల్లడించారు. ప్రీమియర్, గ్లోబల్ ఔట్‌లుక్, టెక్‌ప్రోస్ సాఫ్ట్‌వేర్, ఆర్కస్ టెక్, శ్రీటెక్, మద్ది సాఫ్ట్, గురూస్ ఇన్ఫోటెక్, ఏఈ ఇన్ఫోటెక్, ఆక్టస్ తదితర కంపెనీలు వీటిల్లో ఉన్నాయి. ఈ కంపెనీల రాకతో ప్రాథమిక దశలో విశాఖలో 310, అమరావతిలో 64 ఉద్యోగాల కల్పన జరుగుతుంది. తనను కలిసిన ఐటీ సేవా సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపు ప్రసంగించారు. మీరంతా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నారనే విషయం తనకు తెలుసన్నారు. ఇందుకు గతంలో తన హయాంలో వేసిన పునాది దోహదపడిందన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో 30 మాత్రమే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న రోజుల్లో వాటి సంఖ్యను 300కు పెంచానని గుర్తుచేశారు. మీ అందరినీ పారిశ్రామివేత్తలుగా చూస్తున్నందుకు సంతోషంగా ఉందని, మరింతగా ఎదగాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్, స్మార్ట్ ఏపీ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రవాస తెలుగువారందరినీ అభినందించారు. కన్నతల్లి లాంటి జన్మభూమిని విస్మరించవద్దని, సొంతూరు అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు. గతంలో తన హయాంలో మూడో పారిశ్రామిక విప్లవాన్ని చూశానని, ప్రస్తుతం నాలుగో పారిశ్రామిక విప్లవం నడుస్తోందన్న ముఖ్యమంత్రి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రపంచాన్ని నడిపిస్తోందని అన్నారు.

చిత్రం... డల్లాస్‌లో ఐటీ సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు