తెలంగాణ

తెలంగాణలో మరిన్ని మెడికల్ కాలేజీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27:తెలంగాణలో కొత్తగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తెలిపారు. కాలేజీల ఏర్పాటుపై ప్రతిపాదనలు అందజేయాలని వైద్య శాఖ ముఖ్యకార్యదర్శిని ఆయన ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీల వివరాలను కూడా సమర్పించాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
సచివాలయంలో శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిమ్స్‌లో ఆధునిక సౌకర్యాలు, పడకల ఏర్పాటుపై ప్రతిపాదనలు ఇవ్వాలని అన్నారు. కొత్తగా పీజి సీట్ల మంజూరు ప్రతిపాదనలు, టవర్ల నిర్మాణాలు, పరిశోధన, ల్యాబ్‌ల ఏర్పాట్లకు నిధుల కేటాయింపుపై చర్చించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ప్రజా స్పందనను గమనించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర మెడికల్, నర్సింగ్, డెంటల్ కౌన్సిళ్లు తమ కార్యకలాపాలు ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పండ్లు మగ్గటానికి వ్యాపారులు కాల్షియం కార్బోనైట్ వాడకుండా నియంత్రించాలని, ప్రత్యామ్నాయంగా మార్కెట్‌లో ఎథిలిన్ చాంబర్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావే శంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.