రాష్ట్రీయం

అగ్ర దేశాలకు దీటుగా భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 9: అగ్ర దేశాలకు దీటుగా ఎదిగేందుకు, అభివృద్ధి సాధించేందుకు దేశంలోని విద్యార్థుల్లో శక్తి సామర్థ్యాలు మెండుగా ఉన్నాయని, మీరు అభివృద్ధి చెంది దేశాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటిలో శనివారం నిర్వహించిన స్నాతకోత్సవం కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఒక ఐడియాతో అన్ని విధాలా అభివృద్ధిలోకి తీసుకుపోవడానికి ట్రిపుల్ ఐటి విద్యార్థుల్లో నైపుణ్యం ఉందని, మనకు ఉన్న వనరుల ద్వారా టెక్నాలజీని అభివృద్ధి దిశగా తీసుకుపోవచ్చునని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియాకు చెందిన మేథావులే అధికంగా ఉన్నారని, అమెరికా వంటి దేశాల్లో క్షేత్రస్థాయిలో విద్యాభ్యాసం ప్రయోగాత్మకంగా కొనసాగుతుంటే ఇండియాలో మాత్రం తరగతి గదులు, ప్రయోగశాలలకే పరిమితమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని వనరులు మనదేశంలో ఉన్నాయన్నారు. గల్ఫ్‌లో భూభాగం అధికంగా లేకపోయినా సముద్రంలో ఉప్పునీరు ఉన్నా ఆ దేశాలు అభివృద్ధిలో ఉన్నాయన్నారు.
సింగపూర్‌లో కేవలం ఒక ఓడ రేవు ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ-చెన్నై వరకూ 974 కిలోమీటర్ల మేర సముద్రయాన తీరప్రాంతాలు ఉన్నాయని, భవిష్యత్తులో ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఓడ రేవుల్లో ముందంజలో ఉంటుందన్నారు. ట్రిపుల్ ఐటిలోని విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యం, టెక్నాలజీని వినియోగించుకుని దేశ వ్యాప్తంగా ఇండియా ఖ్యాతిని చాటిచెప్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. 2050 నాటికి అగ్రదేశాల్లో ఇండియానే అభివృద్ధితో పాటు టెక్నాలజిలో ముందంజలో ఉంటుందన్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ఇండియాకు ప్రత్యేక గుర్తింపు ఉన్నట్లు తెలుసునని, అయితే మనవారు విదేశాల్లో సాహసించిన విధంగా స్వదేశంలో సాహసించని కారణంగానే వెనుకబాటుతనం కన్పిస్తోందన్నారు. ప్రతి విద్యార్థి తనకున్న పరిజ్ఞానంతో విజన్, మిషన్, డెడికేషన్, డిఓషన్లతో ముందస్తుగా పథకాలను వ్యూహరచన చేసుకుని ఎదగాలని సూచించారు. విసి రాజిరెడ్డి మాట్లాడుతూ ఇక్కడ విద్యనభ్యసించిన ప్రతి ఒక్కరూ ఉద్యోగాల్లో కొనసాగుతున్నారని, అంతేగాకుండా నూతన టెక్నాలజీ ఒరవడిలో దూసుకెళ్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి రెండు జిల్లాలకు ఒక ట్రిపుల్ ఐటిని ప్రారంభించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

స్నాతకోత్సవంలో ప్రసంగిస్తున్న ఏపి సిఎం చంద్రబాబు