తెలంగాణ

టిఆర్‌ఎస్‌ది రాజకీయ ఉగ్రవాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ ఉగ్రవాదానికి పాల్పడుతున్నదని టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ రిజర్వేషన్లపై హైకోర్టుకు వెళ్ళనున్నట్లు ఆయన తెలిపారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించలేదని, పైగా ఎస్‌సి డివిజన్ల సంఖ్యను 12 నుంచి 10కి తగ్గించారని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. టిఆర్‌ఎస్ రాజకీయ ఉగ్రవాదానికి పాల్పడుతున్నదని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా ఎన్నికలు నిర్వహించడం లేదని, రిజర్వేషన్లు సక్రమంగా లేవని ఆయన విమర్శించారు. ఓటర్ల సంఖ్యను బట్టి రిజర్వేషన్లు ప్రకటించలేదని, పారదర్శకత లేదని ఆయన దుయ్యబట్టారు. మైనారిటీలకు, గిరిజనులకు 12 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు.
ఇన్‌చార్జీల నియామకం
ఇలాఉండగా గ్రేటర్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను నియమించారు. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు, నలుగురేసి చొప్పున ఇన్‌చార్జీలను నియమించారు.