తెలంగాణ

మరో 15ఏళ్లు కెసిఆరే సిఎం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: మరో పదిహేను, ఇరవై ఏళ్లపాటు కెసిఆర్ ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షునిగా ఉంటారని, తన స్థాయికి మంత్రి పదవే ఎక్కువ అని భావిస్తున్నానని, అంత కన్నా ఎక్కువ ఆశ పడడం లేదని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కెటిఆర్ శనివారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కెసిఆర్ వారసునిగా కెటిఆర్‌ను గ్రేటర్ ఎన్నికల్లో రంగంలోకి దించారనే ప్రచారంపై స్పందిస్తూ తనకు మంత్రి పదవే ఎక్కువని భావిస్తున్నట్టు చెప్పారు. 2014 ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టిఆర్‌ఎస్‌కు మూడు అసెంబ్లీ స్థానాలు, 22శాతం ఓట్లు వచ్చాయని, చేవెళ్ల పార్లమెంటు నియోజక వర్గంలో విజయం సాధించాం, మల్కాజిగిరిలో కేవలం 25వేల ఓట్లతో ఓడిపోయామని తెలిపారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి మారిందని, 18నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో టిఆర్‌ఎస్ ప్రజలకు చేరువ అయిందని అన్నారు. ఇవి తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి, అప్పటి ముఖ్యమంత్రులు వేరు, ఇప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు.
18నెలల్లో సంక్షేమ రంగంలో, అభివృద్ధిలో మేం ఏం చేశామో చూసి ఓటు వేయమని కోరుతున్నామని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిపై ఏం చెప్పామో అది చేసి చూపించాం, అదే విధంగా గ్రేటర్‌లో అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. ఇతర పార్టీలు చేయగలిగింది ఏమీ లేదని, వారికి వేసిన ఓట్లు వృథా అవుతాయని అన్నారు. గ్రేటర్ పరిధిలో వంద డివిజన్లు గెలిచి చూపిస్తామని అన్నారు
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర నాయకులు విమర్శిస్తే, మేం అలానే విమర్శించామని, ఆ సమయంలో పరుష పదజాలం వాళ్లు ఉపయోగిస్తే మేమూ ఉపయోగించామని అన్నారు. అప్పుడు మేం మాట్లాడింది కరెక్టే.. ఇప్పుడు మాట్లాడేది కరక్టేనని అన్నారు. ఉద్యమ కాలంలోనే సామాన్య ఆంధ్ర ప్రజలకు మేం వ్యతిరేకం కాదు, అందరం కలిసి అభివృద్ధి చెందుదామని చెప్పామని గుర్తు చేశారు. ప్రాంతాలుగా విడిపోదాం, అన్నదమ్ముల్లా కలిసుందామని అప్పుడే చెప్పామని కెటిఆర్ గుర్తు చేశారు.
జోక్‌ను జోక్‌గా తీసుకోలేరా?
రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే చివరకు జోక్‌ను జోక్‌గా తీసుకోవడం లేదని అన్నారు. టిఆర్‌ఎస్ పేరును తెలుగు రాష్ట్ర సమితిగా మారుస్తామని, భీమవరం నుంచి పోటీ చేస్తానని తాను జోక్ చేస్తే దానిపై చిలువలు పలవలు అల్లుతున్నారని విమర్శించారు. ఒక మంత్రి వివాహ ఆహ్వాన పత్రిక అందజేయడానికి వచ్చినప్పుడు అమరావతి సభలో బాబు కన్నా కెసిఆర్‌కే ఎక్కువ జనం స్పందించారని చెప్పారని, దాంతో తాను నవ్వుతూ మేం అక్కడికి వస్తున్నాం, తెలుగు రాష్ట్ర సమితిగా పేరు మార్చి భీమవరం నుంచి పోటీ చేస్తానని జోక్ వేశానని తెలిపారు. ఈ సంగతి ఒక సభలో చెబితే దానిపై విమర్శలు చేస్తున్నారని, జోక్‌ను జోక్‌గా తీసుకోలేరా? అని ప్రశ్నించారు. తన్నీరు హరీశ్‌రావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, మీడియా వార్తల కోసం ఏదో సృష్టిస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి ఏ బాధ్యత అప్పగిస్తే అది నెరవేరుస్తున్నామని చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో రెండు మూడు సభల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడతారని కెటిఆర్ తెలిపారు. టీవీల్లో ప్రజలతో ముఖా ముఖి చర్చించనున్నట్టు చెప్పారు. రెండేళ్లలో తెలంగాణలో టిడిపి అనే పార్టీ ఉండదని, టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం పేరు మార్చుకోవడం సంగతి ఎలా ఉన్నా టిడిపి కార్యాలయం ముందు టులెట్ బోర్డు పెట్టుకోవడం ఖాయమని కెటిఆర్ తెలిపారు. కొన్ని డివిజన్లలో సీమాంధ్రకు చెందిన వారికి టికెట్లు ఇస్తాం, గెలిపించుకుంటాం అని కెటిఆర్ తెలిపారు. వారం రోజుల్లో ఎన్నికల ప్రణాళిక విడుదల చేయనున్నట్టు చెప్పారు. మేనిఫెస్టో రూపకల్పన పూర్తయిందని, ముఖ్యమంత్రి పరిశీలన తరువాత విడుదల చేస్తామని కెటిఆర్ తెలిపారు.