రాష్ట్రీయం

యాదాద్రికి ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: నాలుగువేల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు యాదాద్రికి పర్యావరణ అనుమతులు లభించాయ. గత ఏడాదే ప్రాజెక్టు పనులు ప్రారంభం కావాల్సిఉండగా, పర్యావరణ అనుమతులు లభించక ముందుకు సాగలేదు. పర్యావరణ అనుమతులు లభించడంతో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే యోచనతో ప్రాజెక్టుకు సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేసినా, పర్యావరణ అనుమతులు రాకపోవడంతో చాలాకాలంగా పెండింగ్‌లో పడింది. అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించి కేంద్రం నుంచి క్లియరెన్స్ వచ్చింది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నాలుగువేల మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఎక్స్‌ఫర్ట్ అప్రయిజల్ కమిటీ నాలుగువేల మెగావాట్ల పవర్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో జరిగిన సమావేశంలో పర్యావరణానికి సంబంధించి మరికొంత సమాచారంతో సమగ్ర నివేదిక కోరింది. అయతే, గత కనె్సల్టెన్సీ సరైన నివేదిక పంపలేదనే అభిప్రాయంతో తెలంగాణ జెన్‌కో కొత్త కన్సల్టెన్సీతో నివేదికలు రూపొందించి అందించారు. అదే సమయంలో ఏటా ఏడు మిలియన్ టన్నుల బొగ్గు సరఫరాకు సింగరేణి ఒప్పందం కుదరడం, అలాగే ఇండోనేషియా నుంచీ బొగ్గు దిగుమతికి ఒప్పందాలు కుదరడంతో, పర్యావరణ అనుమతులు సులువుగా లభించాయ.