రాష్ట్రీయం

దేశంలోనే రోల్‌మోడల్ గ్రేహౌండ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: దేశంలోనే గ్రేహౌండ్స్ రోల్‌మోడల్‌గా నిలిచారని, ఆక్టోపస్‌లో ఎక్కువశాతం టిఎస్‌ఎస్‌పి అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారని డిజిపి అనురాగ్ శర్మ అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులు కూడా మన శిక్షణ, విధి విధానాలను అడిగి తెలుసుకుంటున్నారని, అలాంటి వ్యవస్థలో పోలీసులు పనిచేయడం అదృష్టంగా భావించాలని డిజిపి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలోని ఆక్టోపస్ క్యాంప్, మూడవ పటాలము బిటిసిని డిజిపి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా బిటిసిలో శిక్షణ పొందుతున్న 923 మంది టిఎస్ ఎస్‌పి శిక్షణార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రజలకు సేవ చేసే అవకాశం ఒక్క పోలీసులకే దొరుకుతుందని, ఇలాంటి గొప్ప శాఖలో ఉద్యోగం దొరికినందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలన్నారు. సమాజంలో శాంతిభద్రతలు పరిపూర్ణంగా ఉంటాయో అక్కడే అభివృద్ధి ఉంటుందని, అలాంటి శాంతిభద్రతలను కాపాడే గురుతర బాధ్యత మనందరిపై ఉందన్నారు. అదేవిధంగా శిక్షణ సమయంలో జాగ్రత్తగా శిక్షణ తీసుకున్నట్లయితే భవిష్యత్తులో సుమారు 35 నంచి 40 సంవత్సరాల వరకు ఫీల్డ్‌లో అది ఉపయోగపడుతుందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిని గ్రేహౌండ్స్, అక్టోపస్‌లో పనిచేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ అన్ని విభాగాల్లో ముందుందని, రాష్ట్రంలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతర కృషి వల్లే ఈ సంవత్సరం రాష్ట్ర పోలీసులకు వివిధ బహుమతులతోపాటు అత్యధిక గ్యాలంటరీ మెడల్స్, శౌర్యచక్ర పతకాలు వచ్చాయన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసులకు దేహదారుఢ్యంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం చాలా ఉన్నందున అందరికీ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని నేర్పుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌ఎస్‌పి, ఐజిపి అభిలాషా బిస్త్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ ఐజి కె శ్రీనివాసరెడ్డి, హౌసింగ్ బోర్డు చైర్మన్ బి మల్లారెడ్డి, మూడవ పటాలము కమాండెంట్ బి మోహన్, ఆక్టోపస్ ఎస్‌పి షర్ఫొద్దీన్ సిద్దిఖీ, బిటిసి వైస్ ప్రిన్సిపాల్ డిఎస్‌పి రెడ్డి, అసిస్టెట్ కమాడెంట్లు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.