రాష్ట్రీయం

తిరుమలలో పెళ్లిళ్లకు ఆన్‌లైన్ బుకింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 17: తిరుమల శ్రీ వేంకటేశ్వరుని చెంత వివాహం చేసుకొని, ఒక్కటవ్వాలనుకునేవారికి ఆన్‌లైన్‌లో కల్యాణవేదిక స్లాట్‌ను బుక్ చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే జంటలు తిరుమలలో ఉచితంగా వివాహం చేసుకోవచ్చు. ఇందుకోసం తమ సమీపప్రాంతాల్లోని నెట్ సెంటర్‌లో టిటిడి సేవా ఆన్‌లైన్.కామ్ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న కల్యాణవేదిక కాలమ్‌లో అబ్బాయి, అమ్మాయి వివరాలను నమోదుచేయాలి. వధూవరులు తప్పనిసరిగా తల్లిదండ్రుల వివరాలను నమోదు చేయడమేకాక ఓటర్, ఆధార్ కార్డులలో ఏదో ఒక గుర్తింపుకార్డును అప్‌లోడ్‌చేయాలి. వయసు ధ్రువీకరణ కోసం బర్త్ సర్ట్ఫికెట్ లేదా పదోతరగతి ట్రాన్స్‌ఫర్ సర్ట్ఫికెట్ లేదా మార్కుల జాబితా లేదా డ్రైవింగ్ లైసెన్సు లేదా పాన్‌కార్డు లేదా పాస్‌పోర్ట్ వివరాలను జతచేయాల్సి ఉంటుంది. వీటితోపాటు అందులో వివాహతేదీ, సమయాన్ని వారే నిర్ణయించుకొని అప్‌లోడ్ చేస్తే అక్నాలెడ్జ్‌మెంట్ పత్రం జారీ అవుతుంది. కొత్తగా పెళ్లి చేసుకునేవారు అక్నాలెడ్జ్‌మెంట్ పత్రాన్ని తీసుకొని కేవలం 6గంటల ముందు తిరుమల చేరుకొని కల్యాణవేదిక వద్ద ఉన్న కార్యాలయంలో వారి వివరాలను మరోసారి అక్కడి సిబ్బంది ద్వారా పరిశీలించుకోవాలి. అనంతరం వారికి పురోహితుడు, మంగళవాయిద్యాలతో పాటు అవసరమైన ఓ రోజుకు రూ.50 చెల్లించే వసతి గృహాన్ని, పెళ్లి సమయంలో పసుపు, కుంకుమ, కంకణాలను టిటిడి ఉచితంగా అందిస్తారు. వీటితోపాటు 10 చిన్న లడ్డూలను ఉచితంగా ఇస్తారు. వివాహానికి కావాల్సిన ఇతర సామగ్రిని మాత్రం వధూవరులే తీసుకోవాల్సి ఉంటుంది. వివాహానికి వధూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. పెళ్లికి రాలేని పక్షంలో అందుకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాలి.

ఇల్లెందు ఎమ్మెల్యే కనకయ్యకు
నక్సల్స్ బెదిరింపు లేఖలు
కొత్తగూడెం, మే 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు శాసనసభ్యుడు కోరం కనకయ్యకు మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖలు అందినట్లు ప్రచారం సాగటంతో పోలీసులు భద్రతను పెంచారు. టేకులపల్లి మండలం కోయగూడెంలో నివాసముంటున్న ఎమ్మెల్యే నివాసగృహానికి సిసి కెమెరా ఏర్పాటు చేయటంతో పాటు పోలీసు బలగాలను పెంచారు. ప్రతాప్ అనే వ్యక్తికి ఆరోగ్యం బాగోలేదని, వైద్య సేవలందించాలంటూ భద్రు అనే వ్యక్తి ఎమ్మెల్యే సతీమణి లక్ష్మికి మూడు రోజుల క్రితం ఉత్తరం రాశాడు. ప్రతాప్ వైద్యసేవలకు అయ్యే ఖర్చు కోసం డబ్బులు కావాలంటూ లేఖలో ఎమ్మెల్యేను కోరాడు. అంతకుముందు పలుమార్లు ఎమ్మెల్యేకి ఇదే విషయంపై ఫోన్ వచ్చింది. ఈ లేఖను పరిశీలించిన ఎమ్మెల్యే టేకులపల్లి సిఐ రమేష్‌కు అందజేశారు. దీంతో రెండ్రోజులుగా ఎమ్మెల్యే వాహన శ్రేణికి సైతం అదనంగా పోలీసు భద్రతా వాహనాలను పెంచారు. దీంతో మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖలు వచ్చినట్లు వెలువడిన వార్తలకు బలం చేకూరింది. కోయగూడెం ఓపెన్ కాస్ట్‌లో బొగ్గు రవాణాలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటల కారణంగా ఎవరైనా ఎమ్మెల్యేని బెదిరించి ఉంటారనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.

‘మడ్డువలస’లో పడి
ఇద్దరు యువకుల గల్లంతు
వంగర, మే 17: శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మడ్డువలస ప్రాజెక్టులో దిగిన ఇద్దరు యువకులు బుధవారం గల్లంతయ్యారు. ప్రాజెక్టు దిగువ భాగం బకెట్ పోర్షన్ వద్ద విజయనగరం జిల్లా బలిజిపేట మండలం పెద్ద గలావిల్లి గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు బుధవారం మధ్యాహ్నం స్నానానికి దిగారు. ప్రమాదవశాత్తూ కాలు జారి రిజర్వాయర్ లోపలకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతు కావడంతో వారు మృతి చెందినట్టుగా భావిస్తున్నారు. మరో ముగ్గురు యువకులు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. వీరు రాజాం బంధువుల ఇంటిలో జరిగే పెళ్లికి మంగళవారం వచ్చి డ్యాం చూడడానికి వచ్చినట్టు ప్రమాదం నుంచి యటపడిన పిన్నింటి సునీల్‌కుమార్, పరమేషు, సతీష్‌లు చెప్పారు. నీటిలో గల్లంతైన ఇద్దరు యువకులు ఎస్.దిలీప్ (22), డి.రమణ (25) ఆచూకీ రాత్రికి కూడా లభించలేదు. దిలీప్‌ది హైదరాబాద్ కాగా, రమణది పెద్దగలావిల్లి. తహశీల్దార్ అప్పారావు, పాలకొండ డిఎస్పీ ఆదినారాయణ, ఆర్డీవో రెడ్డి గున్నయ్య అక్కడకు చేరుకున్నారు. రాజాం అగ్నిమాపక సిబ్బంది, స్థానిక గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపడుతున్నారు.