హైదరాబాద్

అన్ని వర్గాల ఆర్థికాభివృద్ధికి సర్కారు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసేందుకు ఎన్నో రకాలుగా కృషి చేస్తోందని ప్రభుత్వ సలహాదారు ఏ.కె. గోయల్ వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికారులకు వివిధ అంశాలపై ఆయన శుక్రవారం హెచ్‌ఆర్‌డిలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ కాకతీయ, నీటి వనరుల ఉపయోగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందన్నారు. రాష్ట్రంలోని వివిధ హోదాల్లో గల అధికారులు సమర్థవంతంగా, చిత్తశుద్ధితో పనిచేసే రాష్ట్ర స్వప్నమైన బంగారు తెలంగాణను సాధించేందుకు వీలుగా తగు శిక్షణను అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాత పది జిల్లాల పునర్యవస్థీకరణ 31 జిల్లాలుగా ఏర్పడిన నేపథ్యంలో ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయటం హెచ్‌ఆర్‌డి సంస్థ ముందున్న కీలక అంశమని వివరించారు. ఇందుకు అనుకూలంగా ఉద్యోగుల సహకారంతో శిక్షణ కార్యక్రమాలకు ప్రత్యేక క్యాలెండర్‌ను రూపొందిస్తున్నామని ప్రణాళిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ బి.పి. ఆచార్య వెల్లడించారు. జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ హైదరాబాద్ ద్వారా నగరాన్ని పరిశుభ్రమైన విశ్వనగరంగా మార్చేందుకు తీసుకున్న కార్యక్రమాలపై వివరించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ ఆర్థిక వృద్ధి రేటు పెరుగుదల, అవకాశాలు, మానవ వనరులు అపారంగా గల హైదరాబాద్ జిల్లా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ప్రధాన పాత్ర వహిస్తుందన్నారు. భవిష్యత్తులో కూడా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో జిల్లా ముఖ్యమైన పాత్ర వహించేలా ఉద్యోగులు తమ బాధ్యతలను నిర్వహించేందుకు ఈ రకమైన శిక్షణ తరగతులు ఎంతగానో దోహదపడుతాయన్నారు. రంగారెడ్డి ఇల్లా కలెక్టర్ రఘునందన్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని నూతన పరిణామాల నేపథ్యంలో ఉద్యోగులకు తమ నైపుణ్యాన్ని ఎప్పటికపుడు మెరుగు పర్చుకోవటం అవసరం అన్నారు. జిల్లా అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు విజయంతంగా చేరవేయటంలో, ప్రజల ఆకాంక్షకు అనుకూలంగా పనిచేయటంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో సహాయపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డా.గౌతం పింగ్లే, డా.సయ్యద్ ఆయుబ్ అలీ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.