ఆంధ్రప్రదేశ్‌

రైతుకు దన్నుగావుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేదరిక నిర్మూలనే ధ్యేయం
పంట సంజీవని అందరి బాధ్యత
సీమను రతనాలసీమగా మారుస్తా
రైతుల అండతో సంక్షోభానికి దూరం
రొంపిచెర్ల సభలో సిఎం చంద్రబాబు

రొంపిచెర్ల, మే 20: రాష్ట్రంలో పేదరికం నిర్మూలించడమే తన ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పంటసంజీవని ప్రతిఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. హంద్రీ-నీవా జలాలతో రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం రానివ్వకుండా చేస్తానని, ఇందుకు రైతుల సహకారం చాలా అవసరమన్నారు. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారిపల్లె పంచాయతీలో ఆయన శనివారం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ లోటు బడ్జెట్ ఉన్నా రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. మిగులు బడ్జెట్ ఉండే రాష్ట్రాల్లో రైతు రుణవిముక్తికి రూ.ఒక లక్ష ఇస్తే, ఒకటిన్నర లక్ష వరకు మాఫీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని అన్నారు. రాష్ట్రంలో రూ.24వేల కోట్లు ఇచ్చి రైతులకు రుణవిముక్తి చేసినట్లు ఆయన తెలిపారు. కొంతమంది నాయకులు రూ. 1.50 లక్షలు తీసుకుని తనను విమర్శిస్తున్నారని అన్నారు. ఎవరైనా భోజనం పెడితే అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదించే సంస్కృతి మనదని, అలాంటి విముక్తి డబ్బులు తీసుకుని తనను విమర్శించే అర్హత వారికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఎవరికైనా రుణవిముక్తి కలగకుంటే ఇప్పుడు కూడా డబ్బులు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు. డ్వాక్రా సంఘాలను తానే ఏర్పాటు చేసి అభివృద్ధి చేశానన్నారు. ఒకప్పుడు ఇంట్లో నుంచి బయటకు రాని సంఘాలకు ఆదాయం కల్పించిటనట్లు తెలిపారు. మహిళా సంఘాలను కాంగ్రెస్ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బందులు వచ్చాయన్నారు. అందుకే తాను మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రతి సభ్యురాలికి రూ.పది వేలు ఇస్తానని చెప్పి ఇచ్చానని, ఈవిధంగా దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా జరగలేదని అన్నారు. 90 లక్షల మందికి పదివేల కోట్లు రెండు విడతల్లో ఇచ్చామన్నారు. ఇంకా సంఘాలకు రూ.మూడు వేలు ఇవ్వాల్సి ఉందని ఇది ఇంకా పెంచి ఆ విడత కూడా ఇస్తానని అన్నారు. డైరీ, ఇతర చేతనైన వృత్తుల ద్వారా డ్వాక్రా సంఘాలకు ఆదాయం కల్పించి పేదరికం నిర్మూలనకు కృషి చేస్తానని అన్నారు. జూన్ 8 లోపల అందరికీ వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించామని అన్నారు. ఈ ఏడాది పది లక్షల ఇళ్ళు పేదవారికి కట్టించేందుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రాబోవు రెండేళ్లలో పది లక్షల ఇళ్లు కట్టిస్తామన్నారు. గ్రామాల్లో సిమెంటు రోడ్లు, డ్రైనేజీ, పంచాయతీ భవనాలు, స్కూలు భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, స్మశానాలు, ఆటస్థలాలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు సిఎం వివరించారు. డబ్బులు ఉన్నా అనందం ఉండదని, అడ్డదారుల్లో డబ్బు సంపాదించినవారు అనునిత్యం ఎప్పుడు జైలుకు పోతామో తెలియకుండా కోర్టు చుట్టూ తిరుగుతూ బాధ పడిపోయే పరిస్థితి ఉంటుందన్నారు. అలాంటివారు మనల్ని కూడా బాధపెట్టే పరిస్థితి ఉంటుందని అన్నారు. నీతి, నిజాయితీగా ఉండి అందరూ సమాజంలో మంచి పనులకు పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాయలసీమలో కరవును నివారించే చర్యలు చేపట్టి రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని అన్నారు. పోలవరం రాష్ట్రానికే ఒక వరమని దీన్ని పూర్తిచేసి జాతికి అంకితం చేసేవరకు సోమవారాన్ని పోలవారంగా పిలుస్తానన్నారు. అనంతరం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రానున్న ఆగస్టు 15 నాటికి హంద్రీ-నీవా పూర్తిచేసి 10 టిఎంసిల నీటిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పరిశ్రమ మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్‌రెడ్డి ప్రకటించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వాల్మీకిపురం-రొంపిచెర్ల మార్గంలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
జగన్ లొంగిపోయారు
రాష్ట్ర విభజనలో హేతుబద్ధత లేదని దీనికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని చంద్రబాబు విమర్శించారు. అటు తెలంగాణాలో ఇటు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ లాలూచీ రాజకీయాలు చేసిందని విమర్శించారు.
ఇప్పుడు వైకాపా నేతలు ప్రధానమంత్రిని కలిసి ప్రత్యేక రాష్ట్రం కోసం రాజీనామా చేస్తామన్నవారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు తాను రాజీ పడినట్లు చెబుతున్నారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీపడి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చానని అన్నారు. తాను తప్పు చేశానన్న పెద్దమనుషులు ప్రత్యేక హోదా పేరుతో రాజకీయం చేసి బెయిల్ కోసం రాజీకెళ్లి సరెండర్ అయ్యే పరిస్థితికి వచ్చారన్నారు. తప్పులు చేసిన వారు ఎప్పుడూ తప్పించుకోలేరని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

చిత్రం... రొంపిచెర్లలో నిర్వహించిన రైతు సభలో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు