రాష్ట్రీయం

వచ్చేది బిజెపి సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా తెలంగాణలో మొదలైన 3 రోజుల పర్యటన
కేంద్ర పథకాలను నిర్లక్ష్యం చేస్తున్నారు దళితవాడలో అమిత్ షా సహపంక్తి భోజనం

హైదరాబాద్, మే 22: తెలంగాణలో రానున్నది బిజెపి సర్కారేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మూడు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా, అక్కడి నుంచి రోడ్డుమార్గంలో నల్గొండ జిల్లా చండూరు మండలం తేరేట్‌పల్లికి చేరుకున్నారు. గ్రామవాసుల ఇంటింటికి వెళ్లి పరిస్థితులు అడిగి తెలుసుకున్న అమిత్ షా, అనంతరం బూత్ కమిటీ సభ్యులు, గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంలో కేంద్ర పథకాలను రాష్ట్రం అమలు చేయడం లేదంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా నాలుగున్నర కోట్ల మరుగుదొడ్లు నిర్మిస్తుంటే, తేరేట్‌పల్లిలో కనీసం ఒక్క మరుగుదొడ్డి కూడా నిర్మించలేదని దుయ్యబట్టారు. తెలంగాణ జిల్లాలో మూడు రోజులు పర్యటిస్తానని, సిద్ధాంతకర్త దీన్‌దయాల్ ఉపాధ్యాయ కార్యదీక్ష కార్యక్రమంలో భాగంగా తాను నల్గొండ జిల్లా, భువనగిరి జిల్లా, హైదరాబాద్ జిల్లాల్లో పర్యటిస్తున్నట్టు ప్రకటించారు. పేదలను కలవడానికే ఇక్కడి పర్యటనకు వచ్చినట్టు చెప్పారు. దేనికోసం మూడు రోజులపాటు తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తున్నానో, అదే కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మంది బిజెపి కార్యకర్తలు ఇదే పనిపై కార్యోన్ముఖులయ్యారన్నారు. తొలి విడతలో పక్షం రోజులు, తరువాత ఆరు మాసాలపాటు, చివరిగా ఏడాదిపాటు దీన్‌దయిళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాలను ప్రచారం చేస్తారన్నారు. అలాగే, రైతులు, బడుగువర్గాలు, ఎస్సీ ఎస్టీలు, అట్టడుగు వర్గాల కోసం మోదీ రూపొందించిన కార్యక్రమాలను పల్లెపల్లెకు, ఇంటింటికీ ప్రచారం చేస్తూ విస్తారక్ యోజనలో మమేకం అవుతున్నారని వెల్లడించారు. ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ బిజెపి అని పేర్కొన్న అమిత్‌షా, ప్రస్తుతం ఈ పార్టీలో 11 కోట్లమంది సభ్యులున్నారన్నారు. ఈ దేశంలో 13 రాష్ట్రాల్లో సొంతంగా బిజెపి అధికారంలో కొనసాగుతోందని గుర్తు చేశారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ విస్తారక్ కార్యక్రమంలో భాగంగా అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీని సంఘటనాపరంగా పటిష్టం చేయడమేగాక, బలోపేతం చేస్తున్నట్టు వివరించారు. దేశంలోని పేదలు, బలహీనవర్గాలు, దళితులు, మహిళలు, రైతులు, యువత కోసం మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. దేశంలో నాలుగున్నర కోట్ల మరుగుదొడ్లు నిర్మిస్తుంటే, తేరేట్‌పల్లిలో ఒక్కటీ లేకపోవడం, ఈ పథకం పట్ల రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి తేటతెల్లం అవుతోందన్నారు. నరేంద్రమోదీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా వికాస్ యాత్ర సాగుతోందన్నారు. తెలంగాణ అభివృద్ధి గురించి అంతా ఆలోచించాలని, మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం వల్లే అది సాధ్యమన్నారు.

చిత్రం... తెలంగాణలోని నల్గొండ జిల్లా తేరేడ్‌పల్లి గ్రామంలో పర్యటిస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా