రాష్ట్రీయం

ఎండ తీవ్రతకు ఆక్వా విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మే 22: గత కొద్ది రోజులుగా చూపిస్తున్న భానుడి ప్రతాపానికి ఆక్వారంగం విలవిల్లాడిపోతోంది. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక చాలా ప్రాంతాల్లో చెరువుల్లో రొయ్యలు, చేపలు చనిపోతున్నాయి. ఇప్పటికే దాదాపు అన్ని చెరువుల్లో రొయ్యలు రంగు మారడం..వైట్ గట్..లూజ్ సెల్‌తో అంతంతమాత్రంగానే ఉన్నాయి. చేపలు చెరువుల్లోనే చనిపోతున్నాయి. మరి కొద్ది రోజులు ఇదే విధంగా పగటి ఉష్ణోగ్రతలు కొనసాగితే భారీ నష్టం వాటిల్లుతుందని రైతులు భయపడుతున్నారు. రాష్ట్రంలోని వేసవి సీజన్‌లో పగటి ఉష్ణోగ్రతలు కొన్ని ఏళ్లుగా సహజంగానే ఉన్నాయి. కాని ఈ ఏడాది ఈ విష్ణోగ్రతలు రికార్డులను సృష్టించింది. ఆక్వా రాజధానిగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలో 45 డిగ్రీల ఉష్ణొగ్రతలు నమోదయ్యాయి. మార్చి మాసంలోనే రాష్ట్రం అంతటా రొయ్యలు సాగు ప్రారంభించారు. ఎకరానికి లక్షన్నర నుంచి 2 లక్షలు వరకు సీడ్ వేశారు. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరుగుతు నేపథ్యంలో ప్రోబయోటిక్స్‌ను అదనంగా వాడారు.
సాధారణంగా వేసవి సీజన్‌లో రొయ్యలు మేతలను ముట్టవు. ఆ ఆహారం చెరువులోఅడుగుకుచేరి కాలుష్యం పెరిగి చనిపోతాయి. అందుకోసం ప్రోబయోటిక్స్‌ని రైతులు వినియోగిస్తున్నారు. దీంతో ఎకరానికి సుమారు రూ.5లక్షలకు పెట్టుబడులు చేరాయి.
ఆశించిన స్ధాయిలో రాని రొయ్య కౌంట్
రొయ్య ఎదుగుదలకు ఎంత ఖర్చు చేసినా ఈ సీజన్‌లో లాభంలేకుండా పోయింది. ఉష్ణోగ్రతల భయంతో కేవలం 60 కౌంట్‌తో సరిపెట్టుకోవాల్సివస్తుంది. కనీసం 30 కౌంట్‌కు కూడా చేరకుండానే పట్టుబడులు చేసేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కడ చూసినా 40, 50, 60 కౌంట్ రొయ్యలే దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు ధరలు కూడా రొయ్య రైతులకు కలిసిరావడంలేదు. కొద్ది నెలల కిత్రమే 50 కౌంట్ రూ.400 ఉంది. ప్రస్తుత సీజన్‌లో కేవలం రూ.250 నుంచి 280 వరకు ఉంది. వేసవి సీజన్‌లో మరీ ముఖ్యంగ ఆక్వా రంగానికి అవసరమైంది ఐస్. సీజన్‌లో కాలువలు కట్టేయడం ఐస్ తయారీకి నీరు లభ్యతకాకపోవడం వల్ల ఏటా వేసవి సీజన్‌లో ఆక్వా రైతాంగం నష్టాలను మూటకట్టుకుంది. చేపకాని రొయ్య కాని చెరువుల్లో పట్టుకున్నప్పుడు వాటిని నిల్వ చేసుకునేందుకు ఐస్ పాత్ర చాలా కీలకం. నిన్నటి వరకు కేవలం క్యాన్ ఐస్ రూ.100 నుంచి ఈ సీజన్‌లో ఐస్ క్యాన్ రూ.550 నుంచి 600 వరకు ధర పెరిగింది. రొయ్య ధరల కన్నా ఐస్ ధర చాలా ఎక్కువగా పెరిగింది. దీనితో ఆక్వా రంగం కుదేలయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఎండలకు చనిపోయిన చేపలు. రంగుమారిన రొయ్యలు. అధిక ధరలకు కొన్న ఐఎస్‌తో చేపలు ప్యాకింగ్ చేస్తున్న దృశ్యం

త్వరలోనే పరిష్కరిస్తా
ప.గో. పోలీసు, ప్రజాప్రతినిధుల వివాదంపై చంద్రబాబు
పోలవరం, మే 22: ప్రశాంత పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసు, ప్రజాప్రతినిధుల మధ్య అంతరాలు నెలకొనడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించి, సాధారణ వాతావరణం నెలకొనేలా చేస్తామన్నారు. జిల్లాలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణపై పోలీసు అధికార్ల సంఘం ధ్వజమెత్తడం, ఆయనపై కేసు నమోదుకావడం, తదనంతరం పలువురు ఎమ్మెల్యేలు గన్‌మన్లను వెనక్కి పంపించడం వంటి సంఘటనలు చోటుచేసుకున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో సోమవారం పోలవరం ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విలేఖర్ల సమావేశంలో పోలీసు, ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న వివాదంపై విలేఖర్లు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు. జిల్లాలో పోలీసులు, ఎమ్మెల్యేలు అంతా మంచివారేనని, ఒకరికొకరు సహకరించుకోవాలన్నారు.రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేయడానికి తాను నిరంతరం శ్రమిస్తున్నానని, ప్రజలందరికి వౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నానన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్భ్రావృద్ధికి విఘాతం కలిగించే ఫ్యాక్షనిజం, రౌడీయిజంను సహించబోనన్నారు. ఇటువంటి వాటిని ప్రోత్సహించేవారికి చట్టపరంగా శిక్షపడేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన హత్యలను తాను ఖండిస్తున్నానన్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్ ప్రారంభమైంది జగన్ తాత రాజారెడ్డి హయాంలోనేనని, దానిని ఇప్పటికీ జగన్ కొనసాగిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
‘హత్యలు’ పునరావృతం కాకుండా చూస్తాం: డిజిపి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 22: ప్రకాశం, కర్నూలు జిల్లాలో జరిగిన ఫ్యాక్షన్ హత్యలు దురదృష్టకరం. ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తామని డిజిపి సాంబశివరావు చెప్పారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ హత్యల వెనుక పోలీసుల వైఫల్యం ఉందనడంలో నిజం లేదని అన్నారు. ఫ్యాక్షన్ గొడవలు కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నాయని, తాను డిజిపిగా బాధ్యతలు స్వీకరించిన సంవత్సర కాలంలో ఒక్క హత్య కూడా జరగలేదని సాంబశివరావు అన్నారు. ఈ ఫ్యాక్షన్ హత్యల వ్యవహారాన్ని సిఎం దృష్టికి తీసుకువెళ్లామని ఆయన చెప్పారు. ఈ ఘటనలను సున్నితంగా పరిశీలిస్తున్నామని, దీనికి బాధ్యులైన వారిని వదిలిపెట్టమని డిజిపి చెప్పారు. కర్నూల్ జిల్లాలో నారాయణ రెడ్డి హత్య దురదృష్టకరమని ఆయన అన్నారు.

రైలులో తరలిస్తున్న నక్షత్ర తాబేళ్లు స్వాధీనం
హిందూపురం, మే 22: రైలులో బెంగళూరుకు తరలిస్తున్న నక్షత్ర తాబేళ్లను అనంతపురం జిల్లా హిందూపురం పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. రైలు ప్రయాణికులు అందించిన సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు సుమారు 200 తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. హజరత్ నిజాముద్దీన్ నుండి యశ్వంత్‌పూర్ వెళ్తున్న (నెం.12650) సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో నాలుగు సంచుల్లో నక్షత్ర తాబేళ్లను కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు బెంగళూరుకు అక్రమంగా తరలించేందుకు పన్నాగం పన్నారు. 4 సంచుల్లో తాబేళ్లను మూటకట్టి ఎస్-4 బోగీలో వేశారు. బోగీలోని సంచుల్లో ఏదో కదులుతున్నట్టు పసిగట్టిన ప్రయాణికులు అనుమానంతో రైల్వే కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేశారు. కర్నూలు, బెంగళూరుకు చెందిన రక్షణదళం ఉన్నతాధికారులు అప్రమత్తమై రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.

అవకాశవాదంగా మారిన రాజకీయం
శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి
ఆదోని, మే 22: నేడు దేశంలో రాజకీయం అవకాశవాదంగా మారిందని, రాజకీయ నాయకులు అవకాశవాదులుగామారి కులాలు, మతాల వారీగా ప్రజలను విభజించి చూస్తున్నారని కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి అన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం నిర్వహించిన ఆత్మీయసభలో స్వామీజీ మాట్లాడుతూ రాజకీయం, రాజకీయ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయం తన మనుగడ కోసం, ఆధిపత్యం కోసం ఏమైనా చేస్తుందన్నారు. రాజకీయ నాయకులు తమ వద్దకు వచ్చే ప్రజలను కులాలవారీగా వర్గీకరించి చూస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదన్నారు. శ్రీరాముడు తన రాజ్యం కోసం, రాజుగా ప్రజల కోరికను మన్నించి సీతాదేవిని అడవికి పంపారన్నారు. కానీ నేటి నాయకులు తమ ఆదిపత్యం కోసం ప్రజలను విస్మరిస్తున్నారన్నారు. నేటి నాయకులు దేశ చరిత్ర గురించి తెలియజేయలేని పరిస్థితి ఉందన్నారు. కానీ అదే నాయకులు రామరాజ్యం తెస్తామని బుకాయిస్తున్నారన్నారు. నాయకులకు హిందూ చరిత్ర గురించి తెలియదన్నారు. చివరకు పాఠ్యంశాల్లో సైతం హిందూధర్మం, హిందూ సంస్కృతిపై దాడిచేసిన పరాయి దేశస్థుల చరిత్రను పొందుపరిచి విద్యార్థులకు చెబుతున్నారన్నారు. మన సంస్కృతి, హిందూ చరిత్రకు రాజకీయ నాయకులు ఇలాంటి దుర్గతి పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతిపై 2200 సంవత్సరాలు అనేక దాడులు జరిగాయన్నారు. అయినప్పటికీ ఈ దేశంలో పుట్టిన గురువులు మన సంస్కృతి, చరిత్రను కాపాడారన్నారు. ఇతర మతస్థులు మన దేశ సంస్కృతిని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేక ఆది శంకరాచార్యులు హిందూ సంస్కృతిని కాపాడటానికి శృంగేరి, తదితర మఠాలను స్థాపించి హిందూధర్మం కోసం పాటుపడ్డారని అన్నారు. దేశ చరిత్ర, సంస్కృతిని కాపాడాలంటే గురువులు రాజ్యాధికారం చేపట్టాల్సిందేనన్నారు.

జన్మభూమి
కమిటీలు రద్దు
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, మే 22 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా అమలు కావడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర కార్మికశాఖా మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. సోమవారం చిత్తూరులో జిల్లా తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఈ జన్మభూమి కమిటీలు సమర్ధవంతంగా పనిచేయకపోవడంతో పాటు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా ఉందని భావిస్తున్నామన్నారు. అందుకోసం వీటిని రద్దు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ స్థానంలో గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి అందులో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు సర్పంచ్‌కు, ఎంపిటిసిలకు స్థానం కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ గ్రామ కమిటీలు కూడా సమర్థవంతంగా పనిచేసేలా ఉండాలన్నారు.