రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: ఉభయ తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు వచ్చేకంటే ముందు కురిసే వర్షాలు (ముందస్తు వర్షాలు) ప్రారంభమయ్యా యి. ఒకవైపు ఈ నెల 25 న రోహిణి కార్తె ప్రారంభం కావడంతో ఎండలు మండుతుండగానే మరోవైపు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతా ల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా నైరుతీ రుతుపవనాలు వచ్చేందుకు పది, పదిహేను రోజుల ముందు నుండే వాతావరణంలో మార్పులు వస్తుంటాయని ఐఎండి హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ వైకె రెడ్డి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఉన్పప్పటికీ, హఠాత్తుగా వాతావరణంలో మార్పువచ్చి వర్షం కూడా కురుస్తుందని వివరించారు. గత 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. వరంగల్ జిల్లాలోని శాయంపేట, ఆత్మకూర్, రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్, పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, తూర్పుగోదావరి జిల్లాలోని కూనవరంలలో గత 24 గంటల్లో నాలుగేసి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, అనంతపురం, వరంగల్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నల్లగొండ తదితర జిల్లాలోని చాలాప్రాంతాల్లో ఒకటి నుండి మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రతో పాటు కేరళ, లక్షద్వీపాలు, కర్నాటకలలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండి శాస్తవ్రేత్త డాక్టర్ ఎస్. బాలచంద్రన్ తెలిపారు. ఇలా ఉండగా బంగాళాఖాతంలో శనివారం ప్రారంభమైన అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా మారిందని ఐఎండి వెబ్‌సైట్‌లో వెల్లడించారు. ఇది వచ్చే 48 గంటల్లో తీవ్రమైన వాయుగుండంగా మారుతుందని, ఆ తర్వాత తుపానుగా మారి బంగ్లాదేశ్ తీరాన్ని దాటుతుందని వెల్లడించారు. వాయుగుండం ప్రభావం వల్ల నైరుతీ రుతుపవనాలు మరింత ముందుకు వెళుతున్నాయని వెల్లడించారు. నైరుతీ రుతుపవనాలు ఈ నెల 30-31 తేదీల్లో కేరళను తాకే అవకాశం ఉందని భావిస్తున్నారు.