రాష్ట్రీయం

సంక్షేమానికి పెద్ద పీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 29: సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌లో నిధులే కాకుండా కొత్త సంక్షేమ పథకాలను అమలు చేసింది. మూడేళ్ల తెరాస ప్రభుత్వం 365 పథకాలను ప్రవేశపెట్టి, దానిలో సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ప్రగతి నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. సాంఘిక, బిసి, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించడంతో పాటు కొత్త పథకాలను ప్రవేశపెట్టి ఆయా వర్గాల ప్రజలకు చేయూతనందించింది. సాంఘిక సంక్షేమ పరిధిలోని హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టడమే కాకుండా అంగన్‌వాడీ కేంద్రాలకు సైతం సన్నబియ్యం సరఫరా చేసి రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్లు, అంగన్‌వాడీలకు కలిపి ఏటా 2.09 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తూ, ఈ పథకానికి 728.81 కోట్లను వెచ్చిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
జనాభాలో ఎక్కువ శాతం ఉన్న బిసిల సర్వతోముఖాభివృద్ధికి 2017-18 బడ్జెట్‌లో రూ.5,070 కోట్లు కేటాయించడంతో పాటు గత మూడేళ్ల పాలనలో విభిన్నమైన పథకాలను ప్రవేశపెట్టి బిసిలకు అండగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఉపకార వేతనాల పెంపు, రూ.1000 కోట్లతో అత్యంత వెనుకబడిన వర్గాల (ఎంబిసిల) అభివృద్ధికి ప్రత్యేక పథకాన్ని చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. తొలిసారి బిసిలకు కల్యాణ లక్ష్మి పథకాన్ని రూ.300 కోట్లతో అమలు చేసేందుకు కేటాయించింది. బిసి వర్గాల సాధికారిత, సంక్షేమానికి తెలంగాణలో బిసి కమిషన్‌ను గత ఏడాది అక్టోబర్ 16న ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బిసిల కోసం ప్రత్యేకించి 119 ఆశ్రమ పాఠశాలలను ప్రారంభించడమే కాకుండా గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
75 శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ, నూరు శాతం సబ్సిడీతో చేప పిల్లల పెంపకం వంటి పథకాలను ప్రవేశపెట్టినట్లు తెరాస ప్రభుత్వం వెల్లడించింది. చేనేత సంక్షేమానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.1200 కోట్ల నిధులు కేటాయించింది. బిసిలకు విదేశీ విద్యను అందించేందుకు గత ఏడాది దసరా పండుగ రోజు మహాత్మా జ్యోతిరావ్ పూలే బిసి ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 79 మంది బిసి విద్యార్థులు లబ్ధిపొందారు. మొత్తం 300 మంది విద్యార్థులకు ఈ సంవత్సరం స్కాలర్‌షిప్ అందించనున్నట్లు తెలిపింది. గీత, మత్స్య కార్మికులకు రూ.5 లక్షల బీమా పథకాన్ని 2015లో ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ పథకం అమలు జరుగుతోంది.
ఇక మైనార్టీల సంక్షేమానికి సైతం ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 1244.66 కోట్లను కేటాయించిన ప్రభుత్వం షాదీ ముబారక్ పథకంతో పాటు స్కాలర్‌షిప్‌లు పెంచింది. త్వరలో ఉర్దూలో డిఎస్సీని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించింది. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు, ప్రత్యేక గురుకులాల ఏర్పాటు, ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం వంటి వాటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసిన ఘనత తమదేనని ప్రభుత్వం వెల్లడించింది.

విష నురుగు కక్కిన సరస్సు
బెంగళూరు, మే 29: సోమవారం బెంగళూరు మహానగరం విషపు నురగలతో ఉక్కిరిబిక్కిరి అయింది. నగరంలోని రెండు పెద్ద సరస్సులు బెల్లందూరు, వర్తూర్‌లు పెద్దఎత్తున విషపూరిత నురగలను వెదజల్లాయి. ఒక్కసారిగా రోడ్లమీదకు నురగలు రావటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వైట్‌ఫీల్డ్ రోడ్డులోని వార్తూర్ సరస్సు నుంచి నురగలు మబ్బుల్లా రోడ్డు మీదకు వచ్చేశాయి. దీంతో ట్రాఫిక్ చాలాసేపు జామ్ అయ్యియి. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ దీనివల్ల పెద్ద సమస్య లేదని, త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం ఇదేవిధంగా జరుగుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.