తెలంగాణ

ఇబ్రహీంపూర్ ఘటనలో ఇరువర్గాలపై కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట/సిద్దిపేట అర్బన్, జనవరి 9: మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో గురు, శుక్రవారాల్లో జరిగిన సంఘటలనకు బాధ్యులైన ఇరువర్గాలను గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌పి సుమతి వెల్లడించారు. ఇబ్రహీంపూర్ సర్పంచ్ కుంబాల లక్ష్మిపై దాడి చేసి, సజీవ దహనం చేసేందుకు యత్నించడంతో పాటు, ఆమె ఇంటిని దగ్ధం, పోలీసు అధికారులపై దాడి చేసిన ఘటనలో వీడియో ఫుటేజీల ఆధారంగా గుర్తించి 32 మందిపై కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. వీరిలో ఆరుగురు నిందితులు తోట శంకర్, ఈసరి కిషన్, కోనాపురం కనకరాజు, ఉడుత తిరుపతి, గడ్డమీద రాకేశ్, గడ్డమీద రాజులను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు తెలిపారు. సంఘటన నేపథ్యంలో శుక్రవారం అదుపులోకి తీసుకొన్న 20 మంది నుండి కేసుతో సంబంధం వున్న ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. మిగతా వారిని త్వరలో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిస్తామన్నారు.
హత్య కేసులో నలుగురి రిమాండ్
కరీంనగర్ జిల్లా జిల్లెల్ల గ్రామానికి చెందిన బీడీ కంపెనీ మునీం శ్రీరాం శ్రీహరి హత్య కేసులో సర్పంచ్ ఇబ్రహీంపూర్ సర్పంచ్ కుమారుడు ఎల్లారెడ్డి, నగేశ్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, రజనీకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ సుమతి తెలిపారు. వీరిలో ఎల్లారెడ్డి, నగేశ్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, మహేందర్‌రెడ్డిలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఆమె తెలిపారు. శ్రీరాం శ్రీహరి హత్య కేసులో అతని భార్య అరుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శ్రీరాం శ్రీహరిపై దాడి ఘటన మెదక్ జిల్లా ఇబ్రహీంపూర్‌లో సిరిసిల్ల పోలీసులు కేసును సిద్దిపేట రూరల్‌కు బదిలీ చేసినట్లు ఆమె తెలిపారు.
ప్రాణనష్టం జరగలేదు
ఇబ్రహీంపూర్ సంఘటనలో పోలీసులు సంయమనం పాటించడం వల్లే ప్రాణనష్టం జరగలేదని, పోలీసు బలగాలు పూర్తిస్థాయిలో చేరుకున్నా సమస్య సామరస్యపూర్వకంగా సద్దుమణిగేలా వ్యవహరించామని, ఈ సంఘటనలో పోలీసుల మీద దాడి జరిగినా కాల్పులు జరిగే అవకాశం ఉన్నా మహిళలు పెద్దఎత్తున రావడంతో చాకచక్యంగా తమ ప్రాణాలు అడ్డుపెట్టి సర్పంచు లక్ష్మిని సజీవ దహనం చేసేందుకు యత్నించినా పోలీసులు అడ్డుపడి దెబ్బలు పడ్డా ఆమెను వారి బారి నుంచి రక్షించారన్నారు. ఈ సంఘటనలో ఆస్తినష్టం, డబ్బు, కొంత బంగారం నగలు నష్టం జరిగిందన్నారు.
మునీం శ్రీహరిని సర్పంచు కుమారులు తల్లికి జరిగిన సంఘటనను శ్రీహరిని ప్రశ్నించే క్రమంలో అతను అసభ్యంగా మాట్లాడడంతో దాడి చేసినట్లు వెల్లడించారన్నారు. దాడికి గురైన వ్యక్తి బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు మళ్లీ ఇబ్రహీంపూర్‌కు వచ్చి ఇరువర్గాల మద్య ఘర్షణకు దారితీసిందన్నారు. అనంతరం శ్రీహరికి ముస్తాబాద్ ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇంటికి తీసుకెళ్లగా తెల్లవారుజామున రక్తం వాంతులు చేసుకుని మృతి చెందాడన్నారు. అయతే, శ్రీహరికి శరీరం బయట గాయాలు లేవని, అంతర్గత గాయాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఓఎస్డీ జ్యోతిప్రకాష్, డిఎస్పీ శ్రీ్ధర్, సిఐలు ప్రసన్నకుమార్, సైదులు, ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్, గోపాల్‌రావు పాల్గొన్నారు.