తెలంగాణ
బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకుంటాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, నవంబర్ 27: సరస్వతి నిలయమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలో బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకుని తీరతామని హిందు మత సంస్థలు హెచ్చరించాయి. డిసెంబర్ 10వ తేదీన ఒయు ఆవరణలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తే తాము అడ్డుకుని నిరసన తెలుపుతామని ఆ సంస్థల ప్రతినిధులు హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇటువంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వవద్దని, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. హిందూ జనజాగృతి సమితి ఆధ్వర్యంలో విశ్వహిందూ ఏక్తా మంచ్, శివసేన, తెలంగాణ గోరక్షాదళ్ తదితర హిందు మత సంఘాలు శుక్రవారం హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ భారతికి వినతిపత్రం అందజేశారు. పవిత్ర విద్యా సంస్థలో గోవులను వధించి ఉత్సవం చేసుకోవడం అంటే హిందూ మతాన్ని, హిందువుల మనోభావాలను కాలరాయడమేనని వారు జెసికి వివరించారు.
ఇప్పుడు బీఫ్ ఫెస్టివల్ అని, మరోసారి పిగ్ ఫెస్టివల్ అంటూ బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించడం ఇతరుల మనోభావలను దెబ్బతీయడమే అవుతుందని వారు తెలిపారు. ఈ విజ్ఞాపన పత్రాన్ని కల్టెక్టర్ పరిశీలనకు పంపిస్తానని, పరిశీలన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని జెసి హిందు సంస్థల ప్రతినిధులకు వివరించారు. అనంతరం హిందూ జనజాగృతి సమితి రాష్ట్ర కన్వీనర్ చేతన్ జనార్థన్, శివసేన రాష్ట్ర అధ్యక్షుడు మురారి, తెలంగాణ గో రక్షాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్, హిందూ ఏక్తా మంచ్ కార్యదర్శి జగతయ్య తదితరులు విలేకరులతో మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో గోమాంసాన్ని భక్షించడం హిందువుల ధార్మిక మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. గతంలో కేరళలో ఇలాంటి ఫెస్టివల్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తే, 2012లో ఒయులో జరిగిన బీఫ్ ఫెస్టివల్ కూడా విధ్వంసానికి దారితీసిందని గుర్తు చేశారు. ఎంపి అసదుద్దీన్ ఓవైసీ, అరుంధతీరాయ్ వంటి వారిని ఈ బీఫ్ ఫెస్టివల్‌కు ఆహ్వానించడం తగదని అన్నారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కెసిఆర్‌లకు కూడా వినతిపత్రం ఇవ్వనున్నట్లు వారు తెలిపారు.