తెలంగాణ

ఇక్కఢా అదే కష్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 10: అమెరికాలో తెలుగు విద్యార్థులకు కష్టాలు తప్పడంలేదు. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్న విద్యార్థులు గత రెండు నెలలుగా అక్కడి ఇమిగ్రేషన్ అధికారుల చర్యలతో అవమాన భారంతో తిరిగి వచ్చేస్తున్నారు. తాజాగా ఆదివారం 22మంది విద్యార్థులు శంషాబాద్ చేరుకున్నారు. తమను ఉగ్రవాదుల్లా చూస్తున్నారని, చేతులకు బేడీలు వేసి మరీ నిర్బంధించి గంటల కొద్దీ విచారిస్తూ, తమవి తప్పుడు డాక్యుమెంట్లుగా చిత్రీకరిస్తూ వెనక్కి పంపుతున్నారని పాతబస్తీకి చెందిన ఓ విద్యార్థి వాపోయాడు. ఎంపిక చేసుకున్న వర్శిటీలకు అమెరికా ప్రభుత్వ అనుమతి లేదని, ఆయా వర్శిటీలు బ్లాక్ లిస్టులో ఉన్నాయని వేధించి వెనక్కి పంపేస్తున్నారని వైజాగ్ విద్యార్థి సుమంత్ వాపోయాడు. అమెరికాలోనే ఇమిగ్రేషన్ అధికారుల బాధతలు తప్పలేదంటే.. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న తమను దాదాపు ఎనిమిది గంటలు ఇండియన్ ఎయిర్‌లైన్స్ అధికారులు గదిలో నిర్బంధించి పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారని ఆదివారం ఇక్కడికి చేరుకున్న విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇక్కడికి చేరామని సమాచారం అందుకున్న తమ తల్లిదండ్రుల విజ్ఞప్తిమేరకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చొరవతో బయటపడగలిగామని అన్నారు. ఇదిలావుంటే గురువారం 15మంది శంషాబాద్ చేరుకున్న విద్యార్థులతోపాటు మరికొందరు ఆదివారం ఉదయం చేరుకోవడంతో ఈ నెలలోపే నాలుగుసార్లు మొత్తం 77మంది తెలుగు విద్యార్థులను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు వెనక్కి తిప్పి పంపించారు. అమెరికా కాన్సులేట్‌తో సంప్రదించాం.. అక్కడి అధికారులతో మాట్లాడుతున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు గుప్పిస్తున్నారే తప్ప విద్యార్థులను పట్టించుకోవడంలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఎన్నో ఆశలతో తమ బంగారు భవిష్యత్ కోసం అమెరికా వెళ్లిన విద్యార్థుల సమస్యలను పట్టించుకోవాలని విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.