రాష్ట్రీయం

మంత్రుల మధ్య ల్యాండ్ వార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 14: విశాఖ భూముల కుంభకోణం మంత్రుల మధ్య చిచ్చు రగిల్చింది. ఈ స్కాంతో ప్రభుత్వం, పార్టీ పరువు మంట కలిసింది. బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోయింది. కనీసం సిఐడి విచారణకు కూడా ప్రభుత్వం సాహసించకపోవడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారం విపక్షాలకు అందివచ్చిన అస్త్రంగా పనికివస్తోంది. వాస్తవానికి ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఇలాంటి వివాదాలు వెలుగులోకి వచ్చినప్పుడు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. కానీ అలా జరగటం లేదు. అంతకు మించి కేబినెట్ మంత్రుల మధ్యే విభేదాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈ భూముల కుంభకోణంపై మంత్రి అయ్యన్న వ్యవహరించిన తీరును తప్పుపడుతూ మరో మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి లేఖ రాయడం సంచలనం సృష్టించింది. భూస్కాంపై మంత్రి అయ్యన్నపాత్రుడు నిరాధార వ్యాఖ్యలు చేస్తూ, పార్టీ పరువు తీస్తున్నారంటూ గంటా లేఖ రాయడం గమనార్హం. ఈ నెల 9నే తన లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు గంటా పంపించారు. చంద్రబాబు నాయుడు బుధవారం విశాఖకు రావటానికి ముందే గంటా రాసిన లేఖను ఆయన అనుచరులు విశాఖలో మీడియాకు అందచేశారు. బద్ధ శత్రువులైన మంత్రి గంటా, అయ్యన్న మధ్య ఎప్పటి నుంచో అంతర్గత యుద్ధం నడుస్తోంది. కేవలం అయ్యన్నతో విభేదించే, గంటా శ్రీనివాసరావు 2009ఎన్నికలకు ముందు టిడిపిని వీడి, ప్రజారాజ్యంలో చేరారు. పార్టీలు వేరైనప్పటికీ, వీరిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతునే ఉన్నాయి. 2014ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు చంద్రబాబు సమక్షంలో మళ్లీ టిడిపిలో చేరారు. గంటాను తిరిగి పార్టీలోకి తీసుకోవడాన్ని అయ్యన్నపాత్రుడు వేలాది ముందు తప్పుపట్టారు. ఈ విషయంలో చంద్రబాబు నిర్ణయాన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు, ఆక్రమాలకు పాల్పడుతున్నారంటూ అయ్యన్న గంటాపై పరోక్ష విమర్శలు చేస్తునే ఉన్నారు. అయ్యన్న వ్యాఖ్యలపై గంటా ఏనాడూ ప్రతిస్పందించలేదు. ఆయనపై బహిరంగ విమర్శలకు దిగలేదు. ఇప్పుడు విశాఖ భూముల కుంభకోణంలో గంటాను దృష్టిలో పెట్టుకునే అయ్యన్న వ్యాఖ్యలు చేశారు. సుమారు 15రోజుల నుంచి ఈ వ్యవహారం నడుస్తున్నా, పెద్దగా పట్టించుకోని గంటా, అయ్యన్నపై ఫిర్యాదు చేస్తూ సిఎంకు లేఖ రాయడం సంచలనమైంది. విశాఖ భూముల కుంభకోణంతో ఇరకాటంలో పడిన ప్రభుత్వం వద్ద నష్ట నివారణచర్యలు లేవు. కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ లేఖాస్త్రం బయటపడిందన్న ప్రచారం కూడా జరుగుతోంది.