రాష్ట్రీయం

రుణాల్లో జాప్యం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 16: రైతులు, కౌలు రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రుణ ఉపశమన పథకానికి సహకరించాలని బ్యాంకర్లను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. శుక్రవారం తన కార్యాలయంలో నిర్వహించిన 199వ రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశంలో రూ.1,66,806 కోట్ల విలువైన ప్రతిపాదనలతో రూపొందించిన 2017-18వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఇది నిరుటి కంటే 14.4శాతం ఎక్కువని సిఎం అన్నారు. వ్యవసాయం, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజ్ రంగాలకు బ్యాంకులు చేయూతనివ్వాలన్నారు. రైతాంగానికి వాస్తవిక సమయ ఆధారితంగా రుణాలివ్వాలని ఆయన కోరారు. ‘ప్రస్తుతం గడచిపోయిన ఏడాది అంకెల సమీక్ష ముఖ్యం కాదు. ఈ ఏడాది ఏం చేయబోతున్నాం, ఈ సంవత్సరం రుణ ప్రణాళిక, కార్యాచరణ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి? అనేవి చర్చనీయాంశాలు. చిత్తం ఉన్నా విత్తం ఉండాలి. వ్యవసాయం, వాణిజ్యం, లేదా మరే రంగానికైనా డబ్బులు ముఖ్య’మని చంద్రబాబు అన్నారు. ప్రజా జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి బ్యాంకులు మద్దతునివ్వాలని కోరారు. ‘నిరుడు 30శాతం వర్షపాతం తక్కువ నమోదైన ప్రతికూల పరిస్థితుల్లో సైతం మంచి ఫలితాలు సాధించాం. ఈ ఏడాది మంచిగా వర్షాలు కురుస్తున్నాయని, ఖరీఫ్ ఫలితాలు అత్యంత ఆశాజనకంగా ఉండాలని ఇప్పుడు కోరుకుంటున్నామని’ చంద్రబాబు వివరించారు.
రైతుకు రెట్టింపు ఆదాయ సాధన తమ లక్ష్యమని, ఇందులో భాగంగా ఉద్యానవనం, మత్స్యశాఖ, పాడి పరిశ్రమను అభివృద్ధి చేసి రైతాంగ జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్ల నుద్దేశించి అన్నారు. ఆక్వా రంగం ఆర్థికంగా బలోపేతమైందన్నారు.
ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం
మరోవైపు తమ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని, ఇందుకు ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంగా ముందుకు తీసుకెళుతున్న సుభాష్ పాలేకర్‌ను సలహాదారుగా నియమించామని, రాజధాని అమరావతిలో ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయం నెలకొల్పనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి ఆయోవా యూనివర్సిటీతో ఒప్పందం కుదిరిందని, మేలు రకమైన విత్తనాల అభివృద్ధికి కర్నూలులో ‘మెగాసీడ్ పార్క్’ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు.
వర్షపాతం ఈ ఏడాది ఆశాజనకంగా ఉందని, అయినా ఆగస్టు నెలలో వర్షాభావ పరిస్థితిలో పంటలు ఎండే ప్రమాదం ఏర్పడినట్లయితే మొబైల్ ఇరిగేషన్, రెయిన్ గన్స్ ద్వారా ఎదుర్కొంటామని తెలిపారు. ‘సర్ట్ఫికెట్ ఆఫ్ కల్టివేషన్’ ఆధారంగా, రియల్ టైమ్ ఆధారంగా రుణాలివ్వాలని ముఖ్యమంత్రి బ్యాంకర్లను కోరారు. ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు, టాటా గ్రూపు, మరికొన్ని సంస్థలు సహకారం అందిస్తున్నాయని, బ్యాంకర్లు కూడా విశాల దృక్పథంతో ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరారు. రైతులకు ఎలా మేలు చేయవచ్చో చర్చించి నిర్ణయాలు తీసుకోవడానికి ఇకమీద ప్రతి 10 రోజులకు ఒకసారి సమావేశాలతో సమీక్షిద్దామని, ఈనెల 28న తొలి సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు.
రైతాంగానికి డబ్బులు అవసరమైనప్పుడు బ్యాంకర్లు స్పందించాలని, లేనిపక్షంలో రైతులు కష్టాల్లో కూరుకుపోతారని, ఆలస్యంగా రుణాలిస్తే వాటిని మరో ప్రయోజనానికి ఉపయోగించుకుంటారని బ్యాంకర్లతో అన్నారు. వ్యవసాయ పనుల్లో జియో ట్యాగింగ్‌కు డ్వాక్రా మహిళల సేవలను ఉపయోగించుకుంటున్నామని, ‘సర్ట్ఫికెట్ ఆఫ్ క్రాపింగ్’(సిఓసి) ఆధారంగా రుణాలివ్వాలని కోరారు.
రుణాలు ఉపాధి అవకాశాలను సృష్టించాలి
బ్యాంకర్లు ఇచ్చే రుణాలు ఆర్థిక కార్యకలాపాలను సృష్టించేవిగా, ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పించేవిగా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. లబ్ధిదారులంతా ‘ఆన్‌లైన్ బెనిఫీషియరీ మేనేజ్‌మంట్ అండ్ మోనిటరింగ్ సిస్టం’తో అనుసంధానమై ఉండాలన్నారు. రుణ అర్హత కార్డులతో వచ్చే కౌలు రైతులకు రుణాలివ్వాలన్నారు.
సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ మాట్లాడుతూ ఆన్‌లైన్ బెనిఫీషియరీ మేనేజ్‌మెంట్ అండ్ మోనిటరింగ్ సిస్టం రియల్ టైమ్‌లో భాగంగా బ్యాంకర్లు, కలెక్టర్లు, రైతులకు ఒకే వేదికగా నిలవాలని సూచించారు. ఎస్‌ఎల్‌బిసి ఆదేశాలున్నప్పటికీ కొన్ని బ్యాంకులు లావాదేవీ ఒక్కింటికి 6.50 శాతం సర్వీసు చార్జిగా వసూలు చేయడాన్ని వీడియో కాన్ఫరెన్స్‌లో శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ ప్రశ్నించగా ఈ అంశాన్ని తాము పరిశీలిస్తామని ఎస్‌ఎల్‌బిసి చైర్మన్ అన్నారు. ఇదిలా ఉంటే పదవీ విరమణ చేస్తున్న నాబార్డ్ సిజిఎం వివివి సత్యనారాయణను ముఖ్యమంత్రి చంద్రబాబు సత్కరించారు.
ఆంధ్రాబ్యాంకు ఎండి, ఎస్‌ఎల్‌బిసి చైర్మన్ సురేష్ ఎన్.పటేల్ 2017-18 వార్షిక రుణ ప్రణాళిక నివేదికను సమర్పించగా ఆంధ్రాబ్యాంక్ జనరల్ మేనేజర్ కృష్ణారావు తదితరులు మాట్లాడారు. సమావేశంలో వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నాబార్డు ప్రతినిధులు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.. రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు