రాష్ట్రీయం

రామ్‌నాథ్ ఎంపిక అత్యుత్తమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 19: ఎన్డీయే రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని సిఎం చంద్రబాబు వెల్లడించారు. ‘అత్యున్నత పదవికి జరిగిన అత్యుత్తమ ఎంపిక ఇది’ అని ప్రధాని మోదీతో అన్నారు. సోమవారం మధ్యాహ్నం సిఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్రమోదీ నుంచి ఫోన్ వచ్చింది. భారత రాష్టప్రతి పదవికి బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను ఎన్డీయే అభ్యర్థిగా ఎంపిక చేశామని, ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా తమకు మద్దతివ్వాలని కోరారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీతో మాట్లాడి మద్దతు లభించేలా సహకరించాలని కోరారు. మోదీ విజ్ఞప్తికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. రాష్టప్రతి ఎంపికలో సుదీర్ఘ చర్చలు జరిపి సరైన నిర్ణయం తీసుకున్నారని సిఎం చంద్రబాబు ఈ సందర్భంగా మోదీని అభినందించారు.