రాష్ట్రీయం

కెసిఆర్‌కు మోదీ ఫోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిపాదించిన రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు తెరాస మద్దతు ప్రకటించింది. రామ్‌నాథ్‌ను ఎంపిక చేసిన విషయాన్ని సోమవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సిఎం కెసిఆర్‌కు టెలిఫోన్‌లో తెలిపారు. తాము ప్రతిపాదించిన అభ్యర్థికి మద్దతివ్వాలని ప్రధాని విజ్ఞప్తి చేయగానే, కెసిఆర్ సానుకూలంగా స్పందించారు. ‘రాష్టప్రతి అభ్యర్థి ఎంపిక ఖరారుకాగానే మొదట మీకే (కెసిఆర్) ఫోన్ చేస్తున్నా. దానికి కారణం రాష్టప్రతిగా దళితుడిని ఎంపిక చేయమని సూచించింది మీరే’ అని ప్రధాని గుర్తు చేసినట్టు సిఎంవో వెల్లడించింది. ప్రధాని మద్దతు కోరిన విషయాన్ని కెసిఆర్ పార్టీ సీనియర్లకు వివరించి అభిప్రాయాలు తీసుకున్నారు. దీంతో అధికారికంగా మద్దతు ప్రకటించినట్టు సిఎం పేర్కొన్నారు. దళిత నాయకుడిని రాష్టప్రతి అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల సిఎం హర్షం వ్యక్తం చేశారు.