రాష్ట్రీయం

హైదరాబాద్‌లో మరో భూ కబ్జా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన మియాపూర్ భూకుంభకోణం కేసు అట్టుడుకుతుండగానే, మరో భూకబ్జా వెలుగులోకి వచ్చింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హైటెక్‌సిటీ- మాదాపూర్ రెవెన్యూ గ్రామాల మధ్య గుట్టల బేగంపేట సర్వే నెంబర్ 63లో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో కొందరు పాగా వేశారు. అది వారసత్వంగా వచ్చిన భూమి అంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులు ప్లాట్లు చేసి సామాన్య, మధ్యతరగతి ప్రజలకు విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులు కొందరు ఆదివారం సెలవు దినం కావడంతో ప్లాట్లలో నిర్మాణాలు చేపట్టేందుకు సన్నాహాలు చేశారు. దీనిపై అనుమానం వచ్చిన కొందరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే భూ కబ్జాదారులతో కుమ్మక్కైన అధికారులు అక్రమ నిర్మాణాలపై చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
కబ్జా జరుగుతోందిలా..
గుట్టల బేగంపేట గ్రామ సర్వే నెంబర్ 63లో దాదాపు 90 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. కొంతకాలంగా ప్రయివేట్ వ్యక్తులు ఈ భూమిపై తమకు హక్కు ఉందని, వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులంటూ దాదాపు రెండు ఎకరాల్లో ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక కొందరు పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, అధికారుల అండదండలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కాగా గతంలో ఇదే స్థలంలో కొన్ని ప్లాట్లు చేసి నిర్మాణాలు చేపడుతుండగా రెవెన్యూ అధికారులు కూల్చేశారు. అయినప్పటికీ కబ్జాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆదివారం కొందరు కబ్జా చేసిన స్థలంలో నిర్మాణాలు చేపడుతుండగా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై అధికారులు స్పందిస్తూ గుట్టల బేగంపేటలోని సర్వే నెం 63లో 90 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని, కొంత స్థలాన్ని ఆక్రమించి గదులు నిర్మిస్తున్నారని సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్నామని రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ రాజశేఖర్ తెలిపారు. నిర్మాణాలు చేపడుతున్న స్థలం ప్రభుత్వానిదేనని గుర్తించి, అక్రమ కట్టడాలను కూల్చివేశామన్నారు. ఎవరైనా మరోసారి ఈ స్థలంలో నిర్మాణాలు చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ రాజశేఖర్ హెచ్చరించారు.