రాష్ట్రీయం

ఇక గొర్రెల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పెంపకం పథకాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రారంభించనున్నారు. మత్స్య సంపద పెంపొందించడంతో పాటు, గొర్రెల పంపిణీ, గ్రామీణ కుల వృత్తులను పరిపుష్టం చేయటం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొండపాకలో గొర్రెల పంపిణీ పథకాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభిస్తారు. 8,710 గ్రామ పంచాయితీల్లో 7,846 గొర్రెల పెంపకందారుల సొసైటీలు నమోదయ్యాయి. వీటిల్లో 7,18,069 మంది సభ్యులుగా ఉన్నారు. లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో మొదటి ఏడాది 3,60,098 మందికి, 3,57,971 మందికి వచ్చే ఏడాది గొర్రెలను పంపిణీ చేస్తారు. రాష్టవ్య్రాప్తంగా 4.5 లక్షలమంది గొల్ల, కుర్మలు ఉన్నట్టు అంచనా వేశారు. గ్రామాల్లో నిర్వహించిన సభ్యత్వ నమోదుతో ఆ సంఖ్య 7.18 లక్షలకు చేరిందని పశు సంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చయినా ఇచ్చిన మాట ప్రకారం గొర్రెల పంపిణీ జరుగుతుందని ప్రకటించారు. గొర్రెల పంపిణీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. గొర్రెల కొనుగోలు కోసం అధికారులు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, తదితర రాష్ట్రాల్లో నాలుగు నెలలుగా పర్యటించారు. గొర్రెల పంపిణీ కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు మంత్రి వెల్లడించారు. పథకంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. గొర్రెల పంపిణీకే ప్రభుత్వం పరిమితంకాకుండా రాష్ట్రంలో పెరగనున్న గొర్రెల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని దానికి అవసరమైన ముందుస్తు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. గొర్రెల మంద వద్దకే వెళ్లి వైద్య చికిత్స అందించేందుకు వంద సంచార పశు వైద్య వాహనాలు ప్రారంభిస్తారు. 45 లక్షల ఎకరాల అటవీ శాఖ భూముల్లో పండ్ల తోటలలో గొర్రెల కోసం గడ్డిని పెంచేందుకు ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. రైతులు తమ భూముల్లో గడ్డి పెంచేందుకు 75శాతం సబ్సిడీపై స్లైలో హెమాట రకం గడ్డి విత్తనాలను సరఫరా చేయనున్నట్టు మంత్రి తెలిపారు. మంగళవారం రాష్టవ్య్రాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో కార్యక్రమం ప్రారంభమవుతుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు తమ తమ నియోజకవర్గాల్లో ఒకేరోజు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్