రాష్ట్రీయం

ప్రైవేటు బస్సులను తిరగనివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: ఉభయ తెలుగురాష్ట్రాల్లో ప్రైవేటు బస్సులను అడ్డుకోవద్దని సేఫ్టీ జర్నీకి తోడ్పడాలని ప్రైవేటు బస్సు ఓనర్స్, ఆపరేటర్ల అసోసియేషన్ రాష్ట్రప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. సోమవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సునీల్‌కుమార్, సభ్యులు విక్రమ్‌రెడ్డి, శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వెసలుబాటు లేకనే పొరుగు రాట్రల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రైవేటు ట్రావెల్స్ రిజిస్ట్రేషన్లపై తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. తామేమీ పన్నులు ఎవేతదారులం కామని, ప్రభుత్వ నిబంధనల మేరకే పన్నులు చెల్లిస్తూ ట్రావెల్స్ నడుపుతున్నామన్నారు. తెలుగురాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం లేకపోవడంతోనే ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నామని వారు స్పష్టం చేశారు.
ప్రభుత్వాలు ట్రావెల్స్‌పై చట్టవ్యతిరేకంగా అవలంభిస్తున్నాయని, ఒక వ్యక్తి ప్రమేయం, ప్రభుత్వంపై ఒత్తిడి మేరకు పాలకవర్గం తమపై దాడికి పాల్పడడం భావ్యం కాదన్నారు. తాము ఆర్టీసీకి పోటీ కాదని వారు స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డికి నాకు ఎటువంటి సంబంధం లేదని, నేను బినామిని కాదని సునీల్ స్పష్టం చేశారు. నాది నిజామాబాద్, జగన్‌గారిది కడప తనతో నాకు ఎలాంటి పరిచయం లేదన్నారు. తమ బస్సులను అడ్డుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కోర్టుకు వెళ్తామని వారు హెచ్చరించారు. నిబంధనలకు లోబడే బస్సులు నడుపుతున్నామని, ఒక వ్యక్తి ఒత్తిడికి ప్రభుత్వాలు తలొగ్గడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వాలు కల్పించలేని రవాణ సౌకర్యాన్ని తాము కల్పిస్తున్నామని, హైదరాబాద్-బెంగుళూరు, హైదరాబాద్-గోవా, పుణె, షిర్డీ, చెన్నై వంటి దూరప్రాంతాలకు సర్వీసులు నడుపుతున్నామన్నారు. ఇతర రాష్ట్రాలు నిర్దేశించిన టాక్స్‌ను చెల్లిస్తూ, ఆయా రాష్ట్రాల నిబంధనలకు లోబడే బస్సులు నడుపుతున్నామన్నారు.
అరుణాచల్ ప్రదేశ్ అధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వడంతోనే ఆ రాష్ట్ర రవాణాశాఖ కొన్ని ప్రైవేటు బస్సుల రిజిస్ట్రేషన్లను రద్దు చేసిందని, అయితే దీనిపై తాము ఈటానగర్ కోర్టుకు వెళ్లామన్నారు. కోర్టు కూడా సానుకూలంగా స్పందించిందన్నారు. ఆలిండియా పర్మిట్‌కు ఒక సీటుకు మూడు నెలల కాలపరిమితికి రూ. 3,750లు పన్ను చెల్లిస్తున్నామని, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ బస్సులను తిరుగనివ్వకపోవడంతో బెంగుళూరు-హైదరాబాద్ నడిచే స్లీపర్ సెల్ బస్సులను రద్దు చేసుకున్నామన్నారు.
దీంతో బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చే వారిపై అదనంగా వెయ్యి రూపాయలు భారం పడుతుందన్నారు. రూ. 700లు ఒకరికి చార్జీ తీసుకుంటే.. ఇప్పుడు రూ. ఒక్కరికి రూ. 1500ల వరకు డిమాండ్ పెరిగిందన్నారు. స్టేజీ క్యారియర్‌గా నడుపుతున్నట్టు వచ్చిన ఆరోపణలను వారు త్రోసిపుచ్చారు. తాము స్టేజీ క్యారేజిగా బస్సులు నడపడం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు బస్సు సర్వీసులను అడ్డుకోవద్దని వారు విజ్ఞప్తి చేశారు.