రాష్ట్రీయం

రైల్వే భద్రత, సమయపాలనపై కఠినంగా వ్యవహరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: ప్రయాణికుల భద్రత ధ్యేయంగా సమయపాలనతోపాటు రేల్వే స్టేషన్లలో సౌకర్యాల మెరుగుపై దక్షిణ మధ్య రైల్వే అధికారులతో జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ సోమవారం సమీక్షించారు. సికిందరాబాద్ రైల్ నిలయంలో జరిగిన సమీక్షలో సికిందరాబాద్, హైదరాబద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందెడ్ డివిజన్లకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిఎం వినోద్‌కుమార్ మాట్లాడుతూ, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, రైల్వే భద్రతకు తగు చర్యలు తీసుకుంటూ రైళ్ల సమయపాలనపై కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. విజయవాడ డివిజన్‌కు చెందిన తుని స్టేషన్ ట్రాక్‌మెన్ టి ఉదయ్‌భాస్కర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మంత్’ అవార్డును అందజేశారు. ఈ సమావేశంలో అదనపు మేనేజర్ జాన్ థామస్, ప్రిన్సిపాల్ చీఫ్ ఇంజనీర్ ఎస్‌ఎన్ సింగ్, సేఫ్టీ ఆఫీసర్ డికె సింగ్ పాల్గొన్నారు.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న జిఎం వికె యాదవ్