రాష్ట్రీయం

4 నుంచి విజయవాడలో వేంకటేశ్వర వైభవోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 23: హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో సనాతన ధర్మ పరిరక్షణతో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామికి అందించే సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్తానం జెఈవో పోలా భాస్కర్ తెలిపారు. శుక్రవారం విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జెఈవో మాట్లాడుతూ తిరుమలకు వెల్లాలంటే చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న పని అని, అందుకే తిరుమలకు రాలేనివారికోసం, వృద్ధులకు వేంకటేశ్వర వైభవోత్సవాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు విజయవాడలో జూలై నాల్గవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు వీటిని నిర్వహిస్తున్నామన్నారు. తిరుమలలో రోజుకు అనుకూలాన్ని బట్టి లక్ష మంది భక్తులకు స్వామి వారి దర్శనం కల్గుతుందన్నారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల్లో ఏర్పాటు చేసిన స్వామి వారిని దర్శించుకునేందుకు రోజుకు పదివేల మంది భక్తులకు అవకాశం ఉందన్నారు. తిరుమలలో అందరికీ స్వామి వారి దర్శనం కలిగించటం కుదరదని, అందుకే ఇక్కడ స్వామి వారిని ప్రజలందరికీ అందుబాటులో ఉంచేందుకు ఈ విధంగా చేశామన్నారు. పెద్ద వేదిక ఏర్పాటు చేసి తిరుమల తరహా ఆనంద నిలయంతో పాటు స్వామి వారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు.