తెలంగాణ

అడుగంటిన సాగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, జనవరి 11: తెలుగు రాష్ట్రాల వరప్రదాయినిగా ప్రసిద్ధిగాంచిన నాగార్జునసాగర్ జలాశయం నీరులేక వెలవెలబోతోంది. వర్షాలు సమృద్ధిగా కురిస్తే నీటితో కళకళలాడాల్సిన జలాశయంలో నీరు రోజురోజుకూ అడుగంటుతోంది. మునె్నన్నడూ లేనివిధంగా జలాశయంలో నీటిమట్టం ఈసారి డిసెంబర్‌లోనే కనిష్ఠస్థాయి కంటే దిగువకు పడిపోయింది. సాగర్ ప్రాజెక్టు గరిష్ఠస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, కనిష్ఠస్థాయి నీటిమట్టం 510 అడుగులు. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 508 అడుగులకు చేరింది. ఇది 128.80 టీఎంసీలకు సమానం. గత ఏడాది ఇదేరోజు జలాశయం నీటిమట్టం 549 అడుగుల వద్ద ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 850 అడుగులు కాగా, ప్రస్తుతం 832 అడుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం 600 ఎంజిడి నీరు అవసరం ఉంది. అంటే ఏడాదికి 36 టీఎంసీల నీరు తాగునీటి అవసరాల కోసం కావాల్సి ఉంది. కాగా, మరో ఎనిమిది నెలలకుగాను 24 టీఎంసీల నీరు హైదరాబాద్ అవసరాలకు కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం సాగర్ జలాశయంలో నీటి నిల్వ కనీస నీటిమట్టంకన్నా రెండు అడుగుల దిగువకు వెళ్లింది. జలాశయం కనిష్ఠ స్థాయి నీటిమట్టం 510 అడుగులకంటే రెండు అడుగులు దిగువకు వెళ్లటంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఇంతకన్నా తగ్గితే పుట్టం గండివద్ద ఏర్పాటు చేసిన మోటర్లకు నీరు అందే పరిస్థితి ఉండదు. ఇదే జరిగితే తాగునీరు సైతం దొరకని పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

చిత్రం... నీరులేక అడుగంటిన సాగర్ జలాశయం

సమర్థతకు గీటురాయి

నన్ను చూసే ఇనె్వస్టర్లు వస్తున్నారు..
అంచనాలకు మించి పెట్టుబడులు రాక
ఎన్‌ఆర్‌ఐల నుంచి అనూహ్య స్పందన
ఎంఎస్‌ఎంఇలను మరింత ప్రోత్సహిస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ

విశాఖపట్నం, జనవరి 11: ‘సిఐఐ భాగస్వామ్య సదస్సులో అంచనాలకు మించి పెట్టుబడులు వస్తున్నాయి. నా సమర్థత, రాష్ట్రంలోవున్న అవకాశాలు చూసి అనేకమంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. జన్మభూమిపై వారికున్న అభిమానాన్ని పెట్టుబడుల రూపంలో చాటుతున్నారు’ అని సిఎం చంద్రబాబు అన్నారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు రెండోరోజైన సోమవారం 245 ఎంఓయులు జరిగాయి. ఎంఓయులను సిఎం చంద్రబాబు ఆయా కంపెనీల యాజమాన్యాలకు అందించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ ఇంత పెద్దఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి రావడం శుభసూచికమన్నారు. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త తయారుకావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా, కుటీర పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఇ) ప్రోత్సహించనున్నట్టు చెప్పారు. జిడిపిలో 37శాతం ఎంఎస్‌ఎంఇల భాగస్వామ్యం ఉందన్నారు. అందుకే వారికి పెద్దఎత్తున రాయితీలిచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు. చిన్న, మధ్య తరహా, కుటీర పరిశ్రమలు ఎక్కడైనా దెబ్బతింటే, వాటిని ఆదుకునేందుకు 100 కోట్లతో నిధిని ఏర్పాటు చేశామని చెప్పారు. చిన్నతరహా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సిఐఐ కూడా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పెద్దఎత్తున కారిడార్లను అభివృద్ధి చేయబోతున్నామని చంద్రబాబు చెప్పారు. నెల్లూరు, చిత్తూరు, చెన్నై కారిడార్‌ను ట్రై ఇండస్ట్రియల్ జంక్షన్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖపట్నం- శ్రీకాకుళాన్ని ఒక క్లస్టర్‌గా, కాకినాడ- నర్సాపురాన్ని, అమరావతి- మచిలీపట్నం- వాడరేవును, కర్నూల్- అనంతపురం- బెంగళూరును ఒక కారిడార్‌గా తీర్చిదిద్దనున్నామని ఆయన పేర్కొన్నారు.

భాగస్వామ్య సదస్సులో
భద్రతా వైఫల్యం

ఐఏఎస్‌గా చెప్పుకుని సిఎం చాంబర్‌లోకి వచ్చిన ఆగంతకుడు
కానిస్టేబుల్ యూనిఫాంలో ప్రాంగణంలోకి చొరబడిన మరో వ్యక్తి

విశాఖపట్నం, జనవరి 11: భాగస్వామ్య సదస్సులో యంత్రాగాన్ని కలవరపెట్టేలా సోమవారం భద్రతా వైఫల్యాలు చోటు చేసుకున్నాయి. దేశ, విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి సహా పలువురు కీలక కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రివర్గ ప్రతినిధులు హాజరైన సదస్సుకు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేసిన్నట్టు పోలీసు అధికారులు చెప్పుకొచ్చారు. అయితే సదస్సు రెండో రోజు చోటుచేసుకున్న ఘటనలతో భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. దీంతో సీనియర్ పోలీసు అధికారులతోపాటు సిఎం, ఇతర మంత్రులు ఉలిక్కిపడ్డారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోనప్పటికీ ఒక అనామకుడు భాగస్వామ్య సదస్సు కీలక వేదికల వద్ద కలియతిరగడం, సాక్షాత్తూ సిఎం చాంబర్‌లోకి సైతం సునాయాసంగా ప్రవేశించడంతో భద్రతా సిబ్బంది కలవరపాటుకు లోనయ్యారు. సదస్సు జరుగుతున్న ఏపీఐఐసిసి ప్రాంగణం వద్ద విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకు దారితీసే మార్గాన్ని దిగ్బంధనం చేసి, విఐపిలకు సంబంధించినవి మినహా ఎటువంటి వాహనాలను అనుమతించలేదు. అయితే సదస్సు రెండో రోజు సోమవారం మాత్రం ఒక వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్‌గా చెప్పుకుంటూ నేరుగా ప్రాంగణంలోకి ప్రవేశించాడు. సమావేశాలు జరుగుతున్న హాల్ 1, 2, 3ల్లోకి ప్రవేశించి, అక్కడ్నుంచి నేరుగా సిఎం విడిది చేసే చాంబర్‌లోకి సైతం చేరుకోగలిగాడు. సుమారు రెండు గంటల పాటు అజ్ఞాత వ్యక్తి అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ప్రాంతంలో సంచరించినప్పటికీ ఎవరికీ ఎటువంటి అనుమానం కలగలేదు. అయితే అజ్ఞాత వ్యక్తి రెండోసారి సిఎం చాంబర్‌లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా, అక్కడున్న భద్రతా సిబ్బంది అనుమానించి ప్రశ్నించారు. దీంతో బండారం బయటపడింది. పోలీసు విచారణతో అతను శ్రీకాకుళం జిల్లాకు చెందిన రమేష్ నాయుడుగా బయటపడింది. గతంలో పలు మోసాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా సదస్సు జరుగుతున్న ప్రాంగణంలోకి సోమవారం ఒక వ్యక్తి పోలీసు యూనిఫాంలో ప్రవేశించాడు. అయితే అప్పటికే అప్రమత్తంగా ఉన్న భద్రతా సిబ్బంది నకిలీ పోలీసును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు నాలుగంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు పోలీసు యంత్రాంగం చెప్పుకొచ్చింది. స్థానిక పోలీసులతో పాటు గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎఆర్ పోలీసులను భద్రత కోసం నియమించారు. వేదిక ఏర్పాటు చేసిన ప్రాంతంలో సీనియర్ పోలీసు అధికారులను నియమించి, నిరంతరం పర్యవేక్షించారు. అయితే ఇంత భద్రతను తోసిరాజని అజ్ఞాత వ్యక్తులు కీలక ప్రాంతాల్లోకి ప్రవేశించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిలావుండగా, వచ్చే నెల విశాఖ ఆర్‌కె బీచ్ వేదికగా అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) జరగనుంది. ఇప్పటికే ఐఎఫ్‌ఆర్ భద్రతపై రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి జెవి రాముడు, అదనపు డిజిపిలు సురేంద్రబాబు, ఆర్‌పి ఠాకూర్ తదితరులు సమీక్షించడం గమనార్హం.

చిత్రం.. భాగస్వామ్య సదస్సు ప్రాంగణంలో సిఎం చాంబర్‌లోకి ప్రవేశించిన
నకిలీ ఐఏఎస్ రమేష్‌నాయుడిని విచారిస్తున్న పోలీసులు

విశాఖ చెన్నై కారిడార్‌కు
840 మిలియన్ డాలర్లు
ఆసియా అభివృద్ధి
బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ థెరిస్సా కో

విశాఖపట్నం, జనవరి 11: విశాఖపట్నం- చెన్నై కారిడార్ అభివృద్ధికి 840 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ థెరిస్సాకో వెల్లడించారు. విశాఖలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో సోమవారం ఆమె మాట్లాడుతూ ఇందులో ఎడిబి 625 మిలియన్ డాలర్లు రుణంగా ఇస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 215 మిలియన్ డాలర్లు వెచ్చించాల్సి వస్తుందని చెప్పారు. ఈ కారిడార్ అభివృద్ధి చెందితే, వచ్చే 30 ఏళ్లలో 11,600 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ఇదిలా ఉండగా కాకినాడ- విశాఖపట్నం, గన్నవరం- కంకిపాడు, వేర్పేడు- శ్రీకాళహస్తి రహదారులను అభివృద్ధి చేయనున్నామని ఆమె తెలియచేశారు. ఇందుకు ఏడిబి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని ఆమె చెప్పారు.

చిత్రం... భాగస్వామ్య సదస్సులో మాట్లాడుతున్న
ఆసియా అభివృద్ధి బ్యాంకు కంట్రీ డైరెక్టర్ థెరిస్సా కో

ఎందుకు
పాటిస్తున్నారు?

ఆ సాంప్రదాయం
రాజ్యాంగ విరుద్ధం
‘శబరిమల’లో మహిళల
నిషేధంపై ‘సుప్రీం’

న్యూఢిల్లీ, జనవరి 11: రుతుస్రావ వయసులో ఉన్న మహిళలను కేరళలోని చరిత్రాత్మక శబరిమల ఆలయంలోకి ప్రవేశించనీయకుండా నిషేధం విధించి ప్రాచీన కాలం నుంచి కొనసాగిస్తున్న సాంప్రదాయన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. రాజ్యాంగం ప్రకారం ఇలా చేయడానికి వీల్లేదని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. ‘మతం ప్రాతిపదికపై మినహా మహిళల ప్రవేశంపై ఆలయం నిషేధం విధించడానికి వీల్లేదు. రాజ్యాంగ పరంగా మీకేమైనా హక్కు ఉంటే తప్ప ఆలయ ప్రవేశంపై నిషేధించడం కుదరదు. ఏదిఏమైనప్పటికీ ఫిబ్రవరి 8వ తేదీన ఈ అంశాన్ని పరిశీలిస్తాం’ అని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎన్‌వి.రమణతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. ముట్లుడిగిన మహిళలను శబరిమల ఆలయంలో ప్రవేశించేందుకు అనుమతిస్తున్నప్పటికీ, రుతుస్రావ వయసులో ఉన్న బాలికలను అనుమతించకపోవడం తెలిసిందే. దీంతో వయసుతో నిమిత్తం లేకుండా బాలికలు, మహిళలందరికీ శబరిమల ఆలయంలో ప్రవేశం కల్పించాలని కోరుతూ యువ న్యాయవాదుల సంఘం ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. దీనిపై సుప్రీం కోర్టు స్వల్ప విచారణ జరిపి, శబరిమల ఆలయంలోకి మహిళలను ఎందుకు అనుమతించడం లేదని, రాజ్యాంగం సమర్ధించని ఈ సాంప్రదాయాన్ని ఎందుకు పాటిస్తున్నారని నిలదీసింది. అంతేకాకుండా గత 1,500 ఏళ్లుగా శబరిమల ఆలయంలో మహిళలు ప్రవేశించడం లేదన్న విషయం నిజమేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది ప్రభుత్వ ఆలయం అయినందున ప్రతి ఒక్కరికీ ప్రవేశ హక్కు కల్పించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.

తడబడిన
సల్వీందర్

కీలక ప్రశ్నలపై వౌనం
పఠాన్‌కోట్‌పై 8గంటలు విచారించిన ఎన్‌ఐఎ

న్యూఢిల్లీ, జనవరి 11: పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై ఉగ్రవాదులు జరిపిన దాడి విషయంలో పంజాబ్ పోలీసు సూపరింటెండెంట్ సల్వీందర్ సింగ్‌ను ఎన్‌ఐఎ అధికారులు సోమవారం దాదాపు 8గంటల పాటు ప్రశ్నించారు. ఇంటరాగేషన్‌లో ఆయన పొంతనలేని ప్రకటనలు చేసినట్టుగా స్పష్టమవుతోంది. సైనిక దాడిలో మృతిచెందిన నలుగురు ఉగ్రవాదుల వివరాలను పూర్తిస్థాయిలో నిర్థారించుకునేందుకు ఎన్‌ఐఎ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఇంటర్‌పోల్ చేత బ్లాక్ నోటీసును జారీ చేయించింది. దీనిద్వారా మరణించిన ఉగ్రవాదుల వివరాలను తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాగా, సల్వీందర్ సింగ్‌ను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7గంటల వరకూ అనేక అంశాలపై అధికారులు ప్రశ్నించారు. మంగళవారం కూడా విచారణ జరుగుతుందని, సల్వీందర్ లై డిటెక్టర్ పరీక్షపెట్టే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. అనేక కీలక ప్రశ్నలకు సల్వీందర్ సరైన సమాధానం ఇవ్వలేదని తెలిపారు.

కదిలిన
పాకిస్తాన్

‘పఠాన్‌కోట్’ ఘటనలో అనుమానితుల అరెస్టు
మూడు జిల్లాల్లో దాడులు

ఇస్లామాబాద్, జనవరి 11: భారత్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్ అధికారులు వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి, దాడితో సంబంధం ఉందనే అనుమానంతో కొంతమందిని అరెస్టు చేసినట్లు నిఘా అధికారులు సోమవారం చెప్పారు. గుజ్న్‌వ్రాలా, జెలుం, బహవల్‌పూర్ జిల్లాల్లో నిర్వహించిన ఈ దాడుల్లో కొంతమందిని అరెస్టు చేశారు. అయితే ఎంతమందిని అరెస్టు చేశారనేది తెలియరాలేదు. అరెస్టయిన వారు పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి పాల్పడినారా? లేక దాడి చేయడానికి సహకరించారా? అనేదాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు సాగుతోందని ఆ అధికారులు చెప్పారు. పఠాన్‌కోట్ దాడితో పాకిస్తాన్‌కు చెందిన వారికి సంబంధం ఉందా? అనే విషయాన్ని తేల్చడానికి దర్యాప్తు జరపాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి), ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ), మిలిటరీ ఇంటెలిజెన్స్, ఫెడరల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ, పోలీస్ శాఖల అధికారులతో కూడిన సంయుక్త దర్యాప్తు బృందాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. పఠాన్‌కోట్‌పై దాడి విషయంలో పారదర్శకంగా దర్యాప్తు జరుపుతామని, బాధ్యులు ఎవరినీ వదలిపెట్టబోమని షరీఫ్ ఇదివరకే ప్రకటించారు. వైమానిక స్థావరంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఫోన్‌లో మాట్లాడిన పాకిస్థాన్‌లోని ఫోన్ నెంబర్లను, ఇతర సమాచారాన్ని భారత్ ఇదివరకే పాకిస్తాన్‌కు అందజేయడంతో పాటు దాడికి సహకరించిన, కుట్ర పన్నిన వారిని గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేసింది.

రాష్ట్రంలో ఇడిబి

ఆగ్రో పరిశ్రమల్లో పెట్టుబడులకు చాన్స్: చంద్రబాబు

విశాఖపట్నం, జనవరి 11: రాష్ట్రంలో ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్టు సిఎం చంద్రబాబు వెల్లడించారు. సిఐఐ ఆధ్వర్యంలో విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సు రెండో రోజు సోమవారం జరిగిన ప్లీనరీ సెషన్‌లో ఆయన ప్రసంగించారు. రాష్ట్రం రెండంకెల అభివృద్ధి రేటు దిశగా పయనిస్తోందన్నారు. రెండు దశాబ్దాల కాలంలో 14నుంచి 1 శాతం వృద్ధి రేటు సాధిస్తామన్నారు. ఇందుకోసం ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని, త్వరలోనే ఇది కార్యరూపం దాల్చుతుందన్నారు. 117 టార్గెట్లు, 12 గోల్స్ సాధించే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. దుబాయ్, సింగపూర్ వంటి చిన్న దేశాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, వీటన్నింటినీ మించి భారతదేశం, అందులోనూ ఆంధ్రప్రదేశ్ సమీప భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చెందబోతోందన్నారు.
గతంలో పొరపాట్లు జరిగాయి
గతంలో తాను సిఎంగా ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమని చంద్రబాబు అంగీకరించారు. తన నిర్ణయాలు కొన్ని వర్గాలకు రుచించలేదన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లలేదన్నారు. దీంతో అధికారాన్ని కోల్పోయామన్నారు.
తరువాత పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని చెబుతూ, ఈ పదేళ్లలో రాష్ట్భ్రావృద్ధి అన్ని రంగాల్లో కుంటుపడిందన్నారు. మళ్లీ 20 నెలల కిందట తాను అధికార పగ్గాలు చేపట్టానన్నారు. కార్గో హ్యాండ్లింగ్‌లో భారతదేశంలోనే రాష్ట్రం రెండోస్థానంలో ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
రాష్ట్రాన్ని మాన్యఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దబోతున్నామని ప్రకటించారు. అలాగే ఆగ్రో రంగంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. మూడు నాలుగేళ్లలో రాష్ట్రంలో కరవులేకుండా చేస్తామని, ఇందుకోసం రెయిన్ గన్స్ వాడాలని నిర్ణయించామని చంద్రబాబు చెప్పారు.

చిత్రం... రిటైల్ రంగాన్ని ప్రోత్సహించేందుకు వాల్‌మార్ట్, ఫ్యూచర్, అరవింద్ లైఫ్‌స్టైల్, స్పెన్సర్స్ గ్రూప్ అధినేతలతో రాష్ట్ర ప్రభుత్వం
15వేల కోట్ల రూపాయల మేర ఒప్పందాలు కుదుర్చుకుంది. వాల్‌మార్ట్ సంస్థతో ఎంఓయు కుదుర్చుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు