రాష్ట్రీయం

‘ఎమర్జెన్సీ’ని పాఠ్యాంశాల్లో చేర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: ‘ఎమర్జెన్సీ-దేశానికి చీకటి రోజులు’ అనే అంశాన్ని పాఠ్యాంశాల్లో చేర్చి భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర సమాచార, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. నాడు ఎమర్జెన్సీని సిపిఐలో కొంత మంది సమర్థించారని ఆయన తెలిపారు. 1975 సంవత్సరం జూన్ 25న నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడాన్ని ‘చీకటి రోజులు’గా పేర్కొంటూ దేశ వ్యాప్తంగా బిజెపి నిర్వహించిన సభలు, సమావేశాల్లో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర శాఖ నగరంలో నిర్వహించిన సమావేశానికి కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, జవదేకర్, దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ప్రసంగిస్తూ 1975 సంవత్సరంలో ఏమి జరిగింది?, ఎమర్జెన్సీని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎందుకు విధించారు?, పత్రికా స్వేచ్ఛను ఎలా హరించారు?, ఆర్‌ఎస్‌ఎస్ వంటి సంస్ధలు ఎలా ఎదుర్కొన్నాయి?, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు?, న్యాయ వ్యవస్థ ఎలా కుంటుపడింది?, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఎలా మసకబారాయి? వంటి అనేకానేక అంశాలను భవిష్యత్తుతరాలకు తెలిపేందుకు పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. అయితే దీనిపై ఇంకా సాహిత్య పరిశోధనలు జరగాల్సి ఉందని ఆయన తెలిపారు. 1975లో ఇండియానే ఇందిరగా, ఇందిరనే ఇండియాగా అభివర్ణించారని ఆయన చెప్పారు. చరిత్రలో అటువంటి చీకటి రోజులు రాకుండా కాంగ్రెస్‌కు ప్రజలు 1977లో గుణపాఠం చెప్పారని, ఆ తర్వాత 2014లో చెప్పారని, అవసరమైతే మరోసారి చెబుతారని అన్నారు. విదేశాలతో దేశానికి ఇబ్బందులు వస్తే, సైన్యం తిరుగుబాటు చేస్తే తదితర అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ విధిస్తుంటారని ఆయన తెలిపారు. కానీ 1975లో ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇస్తే, తనను పదవి నుంచి తప్పిస్తారా? అనే భావనతో ఆమె ఎమర్జెన్సీ విధించారని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్, గుజరాత్‌లో నవనిర్మాణ ఉద్యమం, జెపి, పాత కాంగ్రెస్ నాయకులు సర్వోదయ మండలి, ప్రజలు తిరగబడ్డారని అన్నారు. పత్రికలు చాలావరకు లొంగిపోయాయని, రాంనాథ్ గోయంకా ధైర్యంగా నిలబడ్డారని అన్నారు.
మజ్లిస్‌తో పొత్తు
బిజెపిని కొంతమంది మతతత్వ పార్టీ అంటున్నారని, మజ్లిస్‌తో పొత్తు కుదుర్చుకున్న పార్టీలు మతతత్వ పార్టీలు కావా? అని వెంకయ్య ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థకూ జవాబుదారీతనం ఉండాలని, పార్టీ ఫిరాయింపులను నిరోధించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్టప్రతి పదవికి ఇప్పుడు ఎస్‌సిని పోటీకి నిలిపిన కాంగ్రెస్ లోగడ అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నిలపలేదని ఆయన ప్రశ్నించారు.
ఎమర్జెన్సీ మైండ్ సెట్: జవదేకర్
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రసంగిస్తూ కాంగ్రెస్‌కు ఇంకా ఎమర్జెన్సీ మైండ్ సెట్ ఉందని విమర్శించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు పరోక్షంగా ఎవరు నడిపించారో అందరికీ తెలిసిందేనని అన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్ పోరాటం చేసి ఉండకపోతే ఆనాడే స్వాతంత్య్రాన్ని కోల్పోయి ఉండేవాళ్ళమని ఆయన తెలిపారు. బిజెపి నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, పార్టీ శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామచంద్రారెడ్డి, ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, నగర నాయకుడు రమణి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. ఎమర్జెన్సీ కాలాన్ని ‘చీకటి రోజులు’గా పేర్కొంటూ ఆదివారం హైదరాబాద్‌లో బిజెపి నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్