రాష్ట్రీయం

తప్పు ఎవరిదైనా శిక్ష పడాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: దోనకొండ ప్రాంతంలో తనకు వందల, వేల ఎకరాల భూమి ఉందంటూ పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు చేసిన ఆరోపణలపై విచారణ చేయించాలని ఎపి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ఎపి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వాన్ని కోరారు. ఎపి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ పదవి నుండి కృష్ణారావును ప్రభుత్వం ఇటీవల తొలగించిన తర్వాత ఆయనపై టిడిపికి చెందిన కొంత మంది ఆరోపణలు చేయడంపై ఐవైఆర్ స్పందించారు. ఆదివారం ఇక్కడ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, తాను నీతిగా, ధర్మంగా విధి నిర్వహణ చేస్తూ వస్తున్నానని తెలిపారు. ఎపి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్‌గా పనిచేసినప్పటికీ, వేతనం కానీ, ఇతర అలవెన్సులు కానీ తీసుకోలేదని పేర్కొన్నారు. చైర్మన్‌గా పనిచేస్తుండటంతో తన వద్ద పనిచేసిన ఉద్యోగులకు మాత్రం వేతనాలు చెల్లించాల్సి వచ్చిందని వివరించారు. తనకు దొనకొండలో ఒక సెంటుభూమి కూడా లేదని ఐవైఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తున్న రాయపాటి సాంబశివరావు ఎలాంటి ప్రకటన చేసినా బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. వందల, వేల ఎకరాల భూమి తనకు (కృష్ణారావు) ఉన్నట్టు రాయపాటి సాంబశివరావు చేసిన ఆరోపణలపై వెంటనే విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలు వాస్తవం అని తేలితే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమేనని, ఆరోపణలు తప్పు అని తేలితే సాంబశివరావుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో టిడిపి పెద్దల విచక్షణకే వదిలివేస్తానని ఐవైఆర్ సవాల్ చేశారు.

చిత్రం.. ఐవైఆర్