రాష్ట్రీయం

2018లో మందిర నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 25: దేశంలో ప్రస్తుత పరిస్థితులు అనుకూలిస్తే అయోధ్యలో రామాలయం విషయంలో దీపావళిలోగానే శుభవార్త వినే అవకాశాలున్నాయని బిజెపి ఎంపి సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి 2018నాటికి అయోధ్యలో పూర్తిస్థాయి రామాలయం నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలోని శ్రీవారి శేషాచల కొండపై మాధవ కళ్యాణమండపంలో జరిగిన అంతర్జాతీయ హిందూ ధార్మిక సదస్సులో ఆదివారం ఆయన ప్రధాన ప్రసంగం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మూడు ఆలయాలను ఇవ్వమని అడుగుతున్నామని, అది అయోధ్యలో రామాలయం, మధురలో కృష్ణాలయం, కాశీలో విశే్వశ్వరాలయం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అయోధ్యలో రామాలయం అంశానికి సంబంధించి మాట్లాడుతూ ఇంతకుముందు ప్రధానిగా పివి ఉన్న సమయంలో సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశారని, అందులో వివాదాస్పద స్థలంలో రామాలయం ఉన్నట్లు ఆధారం చూపితే ఆ స్థలాన్ని వారికి అప్పగిస్తామని స్వయంగా కేంద్రం అంగీకరించిందని చెప్పారు. దాని ఆధారంగానే తమ ప్రయత్నాలు అన్నీ ముందుకెళ్తున్నాయన్నారు. తొలిదశలో తాను ఈకేసులో వాదిని కానని, అయితే ఆ తర్వాత దీనిలో ప్రాథమిక హక్కులను కాపాడాలని కోరుతూ ప్రార్థన చేసుకునే అవకాశం కల్పించాలని తాను సుప్రీంకోర్టును ఆశ్రయించానన్నారు. ఈవిషయంలో ముందు గా అయోధ్య అంశాన్ని తేల్చి, ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారని, ఈ విషయంలో జూలైలో తాను మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు. ప్రధాన అంశం పరిష్కారంతోపాటు తన ప్రార్ధన అంశాన్ని కూడా పరిష్కరించాలని నివేదించనున్నట్లు పేర్కొన్నారు. రోజువారీ విచారణను కూడా కోరతానని పేర్కొన్నారు. ఈవిధంగా వచ్చే దీపావళి నాటికి దేశప్రజలు అయోధ్య రామాలయం విషయంలో శుభవార్త వినే అవకాశం ఉందని తెలిపారు. ఒకవేళ ఆలస్యం జరిగినా 2018 నాటికి అయోధ్యలో రామమందిరం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సదస్సులో పాల్గొన్న 3ఆంధ్రభూమి2 సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటే అన్నిటికీ కీలకమైన ఆయుధమని, ఆ దిశగా హిందువులంతా ముందడుగు వేస్తే ఆలయాలపై ప్రభుత్వ గ్రహణం తొలగిపోతుందని స్పష్టం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే కొనసాగితే రానున్న రోజుల్లో ఆలయాల్లోనూ రిజర్వేషన్లు ప్రవేశపెట్టే పరిస్థితి వస్తుందని, ముందుగానే మేల్కొని ఓటును ఆయుధంగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ వ్యవస్థను ఢీకొనడం సామాన్యుల వల్ల ఏమవుతుందన్న నిస్పృహ అవసరం లేదని, ప్రభుత్వాలను నడిపేది రాజకీయపార్టీలే అయినందున అవి ఎన్నికల సమయంలో మన ఓట్ల కోసమే రాక తప్పదని, అప్పుడు మన డిమాండ్ చెపితే దానికి తగ్గట్టుగానే పార్టీలు తమ ఎజెండాలను మార్చుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటాయన్నారు.
శ్రీత్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామిజీ మాట్లాడుతూ ఆలయాలు విద్యాస్థానాలుగా ఉండాలన్నారు. ఆలయాల్లో అర్చక వ్యవస్థ కూడా క్రమబద్ధం కావాలన్నారు. ద్వారకాతిరుమల దేవస్థానం ఛైర్మన్ ఎస్వీ సుధాకరరావు, తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ వి మురళీధరశర్మ తదితరులు ప్రసంగించారు. తొలుత దేవాలయాల పునరుద్ధరణకు, వాటి పరిరక్షణకు విశేష కృషిచేస్తున్నవారికి ఆలయబంధు అవార్డులను ఎంపి సుబ్రహ్మణ్యస్వామి అందజేశారు.

చిత్రం.. ధార్మిక సమ్మేళనంలో మాట్లాడుతున్న ఎంపి సుబ్రహ్మణ్యస్వామి