రాష్ట్రీయం

ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 26: ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా సోమవారం ఏపి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్‌మీరా ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రిని. రంజాన్ సందర్భంగా ముఖ్యమంత్రి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ శుభ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికతో ముస్లిం సోదరులు శాంతి సౌభాగ్యాలతో, సుఖశాంతులతో వర్థిల్లాలన్నారు. సర్వమత ఐకమత్యానికి, ప్రపంచ శాంతికి రంజాన్ ప్రతీక అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు ముల్లా ఎస్.అక్బర్, అలీషా, ఇర్ఫాన్, ముక్త్యర్, మోహియోద్దీన్, ఫిరోజ్, పలువురు ముస్లిం యువకులు పాల్గొన్నారు.
కాగా రంజాన్ పండుగ విజయవాడలో ఘనంగా జరిగింది. మతసామరస్యానికి రంజాన్ పండుగ ప్రతీక అని పలువురు మత పెద్దలు పేర్కొన్నారు. ముస్లిం ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ స్టేడియం వెలుపల బందరు రోడ్డుపై జరిగిన రంజాన్ వేడుకల్లో వేలాది మంది ముస్లింలు ప్రార్థనలు చేశారు. వర్షంతో ప్రార్థనల కోసం స్టేడియంలో చేసిన ఏర్పాట్లన్నీ వృథా అయ్యాయి. బందరు రోడ్డులోనే ప్రార్థనలకు ట్రాఫిక్ డిసిపి క్రాంతి రాణా టాటా అనుమతిచ్చినందుకు ఫారూఖ్ షుబ్లీ కృతజ్ఞతలు తెలిపారు. వౌలానా మక్బుల్, వౌలానా హుస్సేన్ జలీల్ యూత్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షుడు ఫరూక్ షుబ్లీ, జమాతె ఇస్లామియా నేత అక్బర్ బాషా, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, ప్రసంగించారు.

చిత్రం.. రంజాన్ పర్వదినం సందర్భంగా విజయవాడలో ఏపి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్‌మీరా ఆధ్వర్యంలో ముస్లింలు సిఎంను కలిశారు. ముఖ్యమంత్రికి ఖర్జూరం తినిపిస్తున్న ముస్లిం నాయకులు