రాష్ట్రీయం

మాజీ ఎమ్మెల్యే ఆచూకీ లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 26: తిరుమలలో తప్పిపోయిన ఖమ్మంజిల్లా బూర్గంపహాడ్ మాజీ ఎమ్మెల్యే కుంజాభిక్షం తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో ఓ హోటల్ వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే గత రెండు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో కుంజాభిక్షం బాగా నీరసించి ఉండటంతో పోలీసులు వెంటనే ఆయన్ను స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుంజాభిక్షం శ్రీవారి దర్శనార్థం 16 మంది కుటుంబ సభ్యులతో శనివారం తిరుమలకు చేరుకున్నారు. రూ.300 క్యూలైన్‌లోస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపలకు వచ్చే సమయంలో కుంజాభిక్షం కుటుంబ సభ్యులనుంచి వేరయ్యారు. ఈ విషయాన్ని గమనించిన ఆయన సతీమణి వెంకటరమణి, అల్లుడు డాక్టర్ సంతోష్‌కుమార్ చుట్టుపక్కల ఎంత వెదికినా ఫలితం లేకపోవడంతో తిరుమల వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు సిసి పుటేజ్‌లో ఆయన కదలికలను గుర్తించి గాలింపు చేపట్టారు. ఇందుకు రెండు ప్రత్యేక బృందాలను తిరుపతి నగరంలో కూడాగాలించాయి. ఈ క్రమంలో కుంజాభిక్షం ఆచూకీ లభ్యమైంది. వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులు ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. కాగా నీరసంగా ఉన్న కుంజాభిక్షంకు స్విమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన మతిమరుపువ్యాధితో బాధపడుతుండటంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మొత్తంమీద మాజీ ఎమ్మెల్యే మిస్సింగ్ కథ సుఖాంతం అయింది.