రాష్ట్రీయం

రోణంకి ఎంపికపై టిఎస్‌పిఎస్‌సికి హైకోర్టు నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: దివ్యాంగుల కోటా కింద తప్పుడు సర్ట్ఫికెట్‌తో పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షల్లో మూడవ ర్యాంక్ సాధించారని రోణంకి గోపాలకృష్ణపై దాఖలైన పిల్‌కు వివరణ ఇవ్వాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌కు హైకోర్టు నోటీసు జారీ చేసింది. ఇటీవల నిర్వహించిన పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షల్లో రోణంకి గోపాలకృష్ణ అఖిల భారత స్థాయిలో మూడవ ర్యాంకు సాధించారు. మే 31న ప్రకటించిన ఫలితాల్లో ఆతనికి మూడవ ర్యాంకు లభించింది. గత 11 ఏళ్ల నుంచి రేగులపాడు ఎంపిపి స్కూల్‌లో సెకండ్ గ్రేడ్ టీచర్‌గా పని చేస్తున్నారు. హైదరాబాద్‌లో సివిల్స్‌కు శిక్షణ పొందేందుకు రెండునెలల పాటు సెలవు పెట్టారు. మిగిలిన కాలం ఉద్యోగం చేస్తూనే సివల్స్‌కు సిద్ధం అయ్యారు. తాను పదవ తరగతి చదివేప్పుడు చెట్టు పై నుంచి కింద పడ్డానని కుడి చేతికి గాయమైనట్టు రోణంకి కృష్ణ తెలిపారు. కుడి చేతి సమస్య వల్ల తాను ఎప్పుడూ ఫుల్ షర్ట్ ధరిస్తానని చెప్పారు. పదవ తరగతి నుంచి తాను అన్ని పరీక్షలకు దివ్యాంగుల కేటగిరి కింద దరఖాస్తు చేస్తున్నట్టు చెప్పారు.