రాష్ట్రీయం

వహ్వా...లిటిల్ డైరక్టర్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: హైదరాబాద్ వేదికగా వారం రోజులుగా జరిగిన 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ముగింపుకార్యక్రమం ఆర్భాటంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాలబాలికలు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. బాలబాలికల ప్రదర్శనలు, వివిధ ప్రాంతాలు, సంస్కృతీ సంప్రదాయాలను తెలియజేస్తూ చేసిన ప్రదర్శనలతో శిల్పకళావేదిక ఆడిటోరియం శుక్రవారం బాలల కేరింతలతో దద్దరిల్లింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గవర్నర్ నరసింహన్ బాలబాలికలు చేసిన నృత్యాలు, ప్రదర్శనను తిలకించి అభినందనలతో ముంచెత్తారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా బోనాల ప్రదర్శన అద్భుతంగా నిర్వహించారు.
గిరిజనుల సంప్రదాయ నృత్యం, పంజాబీ, బెంగాలీల సంప్రదాయ దుస్తులతో నిర్వహించిన నృత్య రూపకం అబ్బురపరచింది. అపూరూపమైన చిత్రాలను రూపొందించిన లిటిల్ డైరక్టర్స్‌ను గవర్నర్ అభినందించారు. ఈ ఉత్సవాల్లో ప్రదర్శించిన ‘సైకిల్ దొంగ’ చిత్రం గురించి వివరిస్తూ సైకిల్ దొంగ దొరికాడో లేదో తెలియదు గానీ మా మదిని మాత్రం దోచారంటూ గవర్నర్ అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారు. ఈ సందర్భంగా చిత్రోత్సవంలో ప్రదర్శించిన సినిమాలు, షార్ట్ ఫిల్మ్‌లు, ఉత్తమ నటులకు అవార్డులను ప్రదానం చేశారు. యాక్షన్ చిత్రాల విభాగంలో ఉత్తమ చిత్రంగా రష్యాకు చెందిన ‘సెలిస్టియల్ కేమెల్’, యానిమేషన్ విభాగంలో బెల్జియంకు చెందిన ‘సాంగ్ ఆఫ్ ద సీ’, పనోరమ విభాగంలో కొరియాకు చెందిన ‘హౌ టు స్టీల్ ఏ డాగ్’ అనే చిత్రాలు ఎంపికయ్యాయి. అలాగే ఉత్తమ స్క్రీన్ ప్లే చిత్రంగా ‘కోడ్ ఎమ్’, ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌గా ‘ఎల్లో ఫెస్టివల్’ ఎంపికయ్యాయి.
నెదర్లాండ్స్, చైనా, థాయ్‌లాండ్, భారత్‌లోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన బాల చిత్రాల దర్శకులు, నిర్మాతలు, నటులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదికపై అవార్డుల ఎంపిక కమిటీ జ్యూరీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, తెలంగాణ సాంస్కృతిక వ్యవహారాల శాఖ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి, భారత బాలల చలన చిత్ర సొసైటీ అధ్యక్షుడు ముఖేష్ ఖన్నా, సిఇఓ శ్రవణ్‌కుమార్, 19వ బాలల చలన చిత్రోత్సవ ప్రత్యేకాధికారి జి కిషన్‌రావు, సమాచార శాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ పాల్గొన్నారు.