రాష్ట్రీయం

ఓటేసిన బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 17: వెలగపూడిలోని శాసనసభ కమిటీ హాల్‌లో సోమవారం భారత రాష్టప్రతి ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 174మంది శాసనసభ్యులు, ఒక ఎంపీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం రెండుగంటలకే పోలింగ్ ముగిసింది. ఉదయం సిఎం చంద్రబాబు తొలి ఓటు వేయగా, తరువాతి ఓటు స్పీకర్ కోడెల శివప్రసాదరావు వేశా రు. వైకాపా నుంచి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఓటు వేశారు. పోలిం గ్ ఏజెంట్లుగా ఎన్డీయే తరఫున మంత్రి కాల్వ శ్రీనివాసులు, వైసీపీ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వ్యవహరించారు. నిజానికి 174మంది ప్రజాప్రతినిధులు మధ్యాహ్నం ఒంటిగంటకే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే మంత్రి ఆదినారాయణరెడ్డి వాహనం మార్గమధ్యంలో ప్రమాదానికి గురవటంతో ఆయన మరో వాహనంలో విజయవాడకు వచ్చి, ఒంటిగంటకు సీఎం చంద్రబాబు నిర్వహించిన నంద్యాల పార్టీ నేతల సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత రెండుగంటలకు వచ్చి చివరి ఓటు వేశారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు, గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ అవగాహనారాహిత్యం వల్ల వారి ఓట్లు చెల్లకుండా పోయాయి. బ్యాలెట్‌పై అంకె బదులు పేర్లు రాయడంతో సీఎం చంద్రబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ఎన్నికల కమిషన్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని అసెంబ్లీలో ఓటు వేశారు. ఉదయం తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో సచివాలయంలోని తన బ్లాక్‌లో మాక్ ఓటింగ్ నిర్వహించారు. తర్వాత అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్లి ఓటు వేశారు. విజయవాడ స్టేట్‌గెస్ట్ హౌస్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయి, అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్లి పార్టీ తరఫున తొలి ఓటు వేశారు.

చిత్రం.. ఓటు వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు