రాష్ట్రీయం

పూరీకి పిలుపొచ్చింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో 12మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ కాగా, ఈనెల 19 నుంచి నోటీసులు అందుకున్న వారిని ఎక్సైజ్ సిట్ విచారించనుంది. ముందుగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ను సిట్ అధికారులు విచారించనున్నారు. బుధవారం రాష్ట్ర ఎక్సైజ్ కార్యాలయంలో జరిగే విచారణకు పూరి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ముందు హాజరవుతారు. రోజుకు ఒక్కొక్కరి చొప్పు న సిట్ అధికారులు విచారణ జరుపనున్నారు. 20న ముమైత్‌ఖాన్, 21న హీరోయిన్ చార్మి సిట్ అధికారుల ముందు హాజరవుతారు. అయితే ముమైత్ నోటీసులు తీసుకోలేదని తెలుస్తోంది. 22న నటుడు సుబ్బరాజు, 23న కెమెరామెన్ శ్యాంనాయుడిని సిట్ విచారించనుంది. 24న నటుడు రవితేజ, 25న డైరెక్టర్ చిన్నా, 26న హీరో నవదీప్, 27న నటుడు తరుణ్‌లను విచారించనున్నట్టు సిట్ అధికారులు తెలిపారు. 28న సినీ నటులు నందు, తనీష్‌లను సిట్ అధికారులు
విచారించనున్నట్టు ఎక్సైజ్ కమిషనర్ తెలిపారు.
కొనసాగుతున్న నోటీసుల పర్వం
రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో నోటీసుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 12మంది టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులిచ్చిన ఎక్సైజ్ సిట్ అధికారులు, సోమవారం మరో రెండు కొరియర్ సర్వీసులకు నోటీసులు అందజేశారు. డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు కెల్విన్ వాంగ్మూలం ఆధారంగా రెండు కొరియర్ సంస్థలకు నోటీసులు జారీ చేసినట్టు సిట్ అధికారులు తెలిపారు. డ్రగ్స్‌ను కొరియర్ ద్వారా ఎవరు బుక్ చేశారు.. పార్శిల్స్‌ను ఎవరు తీసుకున్నారు అన్న అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కెల్విన్‌తోపాటు అరెస్టయిన మరికొందరిని సిట్ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.
కెల్విన్‌తో డైరెక్టర్ ఫ్రెండ్షిప్
ఇదిలావుండగా కెల్విన్ ఓ ప్రముఖ సినీ డైరెక్టర్‌తో నేరుగా ఫ్రెండ్షిప్ కొనసాగిస్తున్నట్టు కాల్ డాటా రికార్డ్స్ (సిడిఆర్) ద్వారా సిట్ అధికారులు గుర్తించారు. గత ఏడాది నవంబర్ 1న రాత్రి 11.10కి ఏడు నిమిషాల 19 సెకండ్లు, రెండో కాల్‌లో 12 నిముషాలు, అదేవిధంగా నవంబర్ 4, 18, 19 తేదీల్లోనూ, ఐదో కాల్ జనవరి 3న మాట్లాడినట్టు సిట్ గుర్తించింది. ఈ కాల్స్ అన్నీ ప్రముఖ డైరెక్టర్ సెల్ ఫోన్ ద్వారా కెల్విన్ కాల్ డాటాలో రికార్డయి ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. చాలాకాలంగా ఫోన్ ద్వారా సంభాషణలు మానేసిన ఆ డైరెక్టర్, వేర్వేరు నెంబర్లతో కెల్విన్ వాట్సాప్‌కు జెన్, శివ, సన్‌షైన్ అనే కోడ్ భాషతో డ్రగ్స్ బుకింగ్ జరిపినట్టు సిట్ గుర్తించింది. కెల్విన్ కాల్ డాటాలో మొత్తం 25మంది సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా జరిగినట్టు నమోదై ఉంది. కాగా ఇప్పటి వరకు 12మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ కాగా, మరో 13మందికి నోటీసులు సిద్ధంగా ఉన్నాయని, నేడో రేపో జారీ చేస్తామని సిట్ అధికారులు వెల్లడించారు.
ఇదిలావుంటే, మలిరోజు విచారణలో కీలక సూత్రధారి కెల్విన్ నోరు మెదపలేదని తెలుస్తోంది. విచారణాధికారులకు ఏమాత్రం సహకరించక పోవడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. రెండో జాబితాలో సినీ రంగానికి చెందిన ‘స్టార్లు’ ఉన్నారన్న అనుమానాలు, మరోపక్క కీలక రాజకీయ నేతల సంతానం కూడా డ్రగ్స్ వినియోగదారుల లిస్టులో ఉన్నారన్న కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో కెల్విన్ నోరు మెదపక పోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాలు వెల్లడించకుండా కెల్విన్‌పై ఉన్నతస్థాయి వొత్తిళ్లు ఏమైనా వస్తున్నాయా? అన్న అనుమానాలు చోటుచేసుకుంటున్నాయి.

చిత్రం.. దర్శకుడు పూరి జగన్నాథ్‌