రాష్ట్రీయం

మంత్రి కాన్వాయ్ బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునగాల, జూలై 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి పి. ఆదినారాయణరెడ్డి కాన్వాయ్ వాహనం అదుపుతప్పి బోల్తాపడి తృటిలో పెను ప్రమాదం తప్పిన సంఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ఆకుపాముల గ్రామ శివారులో 65వ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భారత రాష్టప్రతి ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొనేందుకు మంత్రి తన కాన్వాయ్‌తో హైదరాబాద్ నుండి ఆమరావతికి వెళ్తుండగా వర్షం కురుస్తున్న కారణంగా రహదారిపై సరిగా కనిపించకపోవడంతో టిఎస్ 09 ఇఎం 4006 నెంబరుగల ఎస్కార్ట్ వాహనం డివైడర్‌ను ఢీకొట్టి అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈప్రమాదంలో వాహనంలో ఉన్న డ్రైవర్ పాండుతో పాటు గన్‌మెన్‌లు సుధాకర్, బషీర్‌లకు స్వల్ప గాయాలు కాగా ప్రథమ చికిత్స నిమిత్తం కోదాడ ఆసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. వాహనం పలు పల్టీలు కొటినా అందులో ప్రయాణీస్తున్న వారు స్వల్ప గాయాలతో బయట పడటంతో ప్రాణపాయం తప్పింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ గడ్డం నగేష్ తెలిపారు.