రాష్ట్రీయం

పద్మవ్యూహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: సంక్రాంతి ప్రయాణీకుల రద్దీతో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణ ప్రాంగణాల్లో ఇసకేస్తే రాలని రద్దీ కనిపిస్తోంది. సగటు ప్రయాణికుడి పరిస్థితి పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టుంది. రిజర్వేషన్ టిక్కెట్లున్న వారికీ ప్రయాణ అగచాట్లు తప్పడం లేదు. ఇక లేనివాళ్ల పరిస్థితి మరీ దారుణం. ఏదోక రైలు పట్టుకుని నిలబడైనా గమ్యస్థానానికి చేరుకోవాలనే ఉద్దేశ్యంతో పండుగ జనం రైల్వే స్టేషన్లకు చేరుతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫాంలు, స్టేషన్ ప్రాంగణం ప్రయాణికులతో కిక్కిరిసి కనిపిస్తోంది. నిత్యం నడిచే రైళ్లకుతోడు ప్రత్యేక రైళ్లను పెద్దఎత్తున రైల్వే నడుపుతున్నందున, ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. రిజర్వేషన్లున్నా బోగీల్లో ఎక్కలేని పరిస్థితి ఉంటోందని గగ్గోలు పెడుతున్నారు. సాధారణ టిక్కెట్లున్న వాళ్లు రిజర్వేషన్ బోగీల్లో ఎక్కడం రిజర్వేషన్లు ఉన్నా ఫలితం లేని పరిస్థితి ఎదుర్కొంటున్నామని అంటున్నారు. దీంతో రిజర్వేషన్ బోగీలు సైతం కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఆర్‌పిఎఫ్, రైల్వే పోలీసులు జోక్యం చేసుకున్నా పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి స్టేషన్లతోపాటు వౌలాలి, లింగంపల్లి వంటి స్టేషన్లవద్ద కొన్ని రైళ్లకు హాల్ట్ సౌకర్యం ఉండటంతో అక్కడా రద్దీ ఉంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆవరణ ఇసకేస్తే రాలనంతగా ఉంది. విశాఖ, నరసాపూర్, తిరుపతి, బెంగళూరుకు గతంలో చాలా ప్రత్యేక రైళ్లు నడిపిన రైల్వే శాఖ, ఈసారి తక్కువ రైళ్లు ప్రకటించడంతో బెర్తుల్లేక జనం నరకం చూస్తున్నారు. 14న భోగికి వెళ్లేందుకు పిల్లలతో అష్టకష్టాలు పడి వెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణాలే కాకుండా, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వైపు వెళ్లే రైళ్లకూ తాకిడి తప్పడం లేదు. చాలా రైళ్లకు అదనపు సిట్టింగ్ సౌకర్యంతో బోగీలు వేసినా రద్దీకి సరిపోలేదని ప్రయాణికులు అంటున్నారు. ఇక బస్‌స్టేషన్లు సైతం అదేస్థాయిలో ఉన్నాయి. ఎంజిబిఎస్, జూబ్లీ బస్‌స్టేషన్, సిబిఎస్ పాత బస్టేషన్‌లతోపాటు దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బినగర్, మియాపూర్, లింగంపల్లి, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల నుంచి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పికప్ పాయింట్లనుంచి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు భారీగా బస్సులు బయలుదేరి వెళ్తున్నాయి. తెలంగాణ, ఏపిఎస్‌ఆర్టీసీలు మొత్తం 3వేల ప్రత్యేక బస్సులను పండుగ సందర్భంగా నడుపుతోంది. ఇబ్బడి ముబ్బడి వాహనాలతో తెలుగు రాష్ట్రాల మధ్య ఎన్‌హెచ్‌లు వాహన రద్దీతో నిండిపోయాయి. విజయవాడ, బెంగళూరు, రాజీవ్ రహదారి, వరంగల్ జాతీయ రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ఎల్‌బినగర్ పాయింట్ నుంచి ఏపిఎస్‌ఆర్టీసి ఆంధ్ర రీజియన్‌కు పెద్దఎత్తున బస్సులు ఏర్పాటు చేసింది. అక్కడ వాహన రద్దీ నియంత్రించలేనంతగా మారింది. దీనికితోడు డిమాండ్‌ను బట్టి అప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్న బస్సులు సైతం పూర్తిగా నిండిపోతున్నాయి. సంక్రాంతి ప్రయాణం అవస్థలుమయంగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు.
చిత్రం..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఎగబడుతున్న ప్రయాణికులు