తెలంగాణ

ఐనవోలు మల్లికార్జునుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్ధన్నపేట, జనవరి 13: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండ లంలోని ఐనవోలు మల్లికార్జుస్వామి జాతర బ్రహ్మోత్సవాలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దేవాలయ ప్రాం గణంలో ఆగమశాస్త్రం ప్రకారం వేద పండితులు తెల్లవారు జాము న నాలుగు గంటల నుండి ప్రత్యేక అర్చణలు, శే్వత లింగానికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, మహానివేదన, మంత్రపు ష్పం నిర్వహించి భక్తులకు తీర్ధ ప్రసాదాల వితరణ నిర్వహించారు. భోగి, సంక్రాంతి పర్వదినాలలో జరిగే జాతరకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మార్నేని రామారావు, ఈఓ శేషు భారతి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఉగాది వరకు మూడు నెలల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారు. వివిధ జిల్లాల నుండి వచ్చే భక్తుల కోసం వరంగల్ ఆర్‌టిసి బస్టాండ్ నుండి ఐనవోలు మల్లికార్జునస్వామి దేవస్థానం వరకు జాతర స్పెషల్ బస్సులను ఏర్పాట్లు చేసినట్లు డిపో మేనేజర్ తెలిపారు.