రాష్ట్రీయం

కమల వికాసంపై అమిత్ షా కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 12: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని క్షేత్రస్థాయికి విస్తరించేందుకు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా ఈనెల 28 నుంచి మూడు రోజుల పాటు విజయవాడలోనే మకాం వేసి, పార్టీలోని అన్ని విభాగాల నాయకులతో భేటీ కానున్నారు. దక్షిణాదిలో బిజెపి విజయానికి విజయవాడ ముఖద్వారం కానుందని, తాను ఏపిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఇటీవల విజయవాడ సభలో చెప్పిన అమిత్‌షా, ఇప్పుడు దానిని ఆచరణలో పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. 3రోజులపాటు ఆయన విజయవాడలోనే ఉండి, రాష్ట్ర పార్టీకి చెందిన 19 కమిటీల సభ్యులందరితో రెండేసి గంటల చొప్పున సమావేశం కానున్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకుని, వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అమిత్‌షా మూడురోజుల పర్యటనలోనే రాష్ట్రానికి సంబంధించి పార్టీ విధాన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు ఓ సీనియర్ నేత చెప్పారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో పాలసీని ప్రకటిస్తున్న అమిత్‌షా, అదే విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేయనున్నారు. అంటే రానున్న ఎన్నికల్లో బిజెపి వైఖరిని అధికారికంగానే ప్రకటించనున్నారు. అమిత్ షా విజయవాడ పర్యటనలో ఒక పోలింగ్ బూత్‌కు వెళ్లి ఆకస్మిక తనిఖీ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ బూత్ కమిటీ సభ్యులతో భేటీ అయి, స్థానికంగా పార్టీ పరిస్థితిని తెలుసుకుంటారు. మేధావులు, జర్నలిస్టులతో భేటీ కానున్నారు. ఒక దళితవాడకు వెళ్లి అక్కడ వారితో సహపంక్తి భోజనం చేస్తున్న సంప్రదాయాన్ని ఇక్కడ కూడా పాటించనున్నారు. రాష్ట్రంలో బీసీలపై కనే్నసిన బిజెపి, ఆ మేరకు వారిని దరి చేర్చుకునే వ్యూహంలో భాగంగా ఆ మూడురోజుల్లోనే ఓబిసి సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలాఉండగా, అమిత్‌షా పర్యటనకు ముందుగానే రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పదవికి ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సోము వీర్రాజుకు సంఘ్ మద్దతునిస్తోంది. ఒకవేళ మాస్ లీడర్‌తోపాటు, ఆర్థిక వ్యవహారాలను భరించే నేత అవసరం ఉందకుకుంటే, కన్నాకు అధ్యక్ష పదవి లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇద్దరిలో ఎవరికి అధ్యక్ష పదవి ఇచ్చినా మరొకరికి కీలక బాధ్యతలతోపాటు, వారి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి స్పష్టత ఇస్తారని అంటున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు పదవీకాలం ముగిసింది. ఆయనకు కేంద్రంలో సహాయమంత్రి పదవి వస్తుందనే ప్రచారం జరుగుతోంది.