రాష్ట్రీయం

డిఎస్సీపై ఇంకా గందరగోళమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 12: పాత జిల్లాల మేరకే డిఎస్సీ ఎంపిక చేపట్టాలా? లేక ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషించాలా? అనే అంశంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఉపాధ్యాయుల నియామకాల ప్రక్రియ- డిఎస్సీని పాత జిల్లాల మేరకే నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త జిల్లాల ప్రకారం నియామకాలు చేపడితే సాంకేతిక సమస్యలతోపాటు న్యాయపరమైన చిక్కులు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు. కొన్ని కొత్త జిల్లాల్లో పోస్టుల సంఖ్య అతి స్వల్పంగా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పాత జిల్లాల ప్రకారమే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. టెట్ ఫలితాలు రాగానే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇందుకు సంబంధించి నిబంధనలనే రూపొందించలేదు. టెట్ ఫలితాలు విడుదలై పది రోజులు గడుస్తున్నా అశావహుల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. దీనికి కారణం టెట్ ఫలితాల్లో దాదాపు 80శాతం మంది ఉత్తీర్ణులు కాకపోవడమే. తొలుత ఆగస్టు 15కంటే ముందే ఏదోక నిర్ణయం తీసుకోవాలని భావించినా, వరుసగా సెలవులు రావడంతో
ఈనెల 17న ఉన్నతాధికారులతో సమీక్ష జరగనుంది. ఈ సమీక్షలో ప్రధానంగా డిఎస్సీ అంశం ప్రస్తావనకు వస్తుందని అంటున్నారు. ప్రస్తుతానికి రాష్టవ్య్రాప్తంగా దాదాపు 8వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు లెక్కలు తేల్చారు. కొత్త జిల్లాల ప్రకారం చూస్తే కొన్ని జిల్లాల్లో ఖాళీలు వందలోపు కూడా ఉండటంతో కొత్త జిల్లాల పరంగా రిక్రూట్‌మెంట్ జరిగితే చాలా స్పల్ప సంఖ్య మేరకే నియామకాలు జరిగినట్టు భావించే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల నిరుద్యోగుల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రోస్టర్ ప్రకారం పాత జిల్లాలవారీ పోస్టుల ఎంపికకు సంబంధించి కసరత్తు జరిగింది. కొత్త జిల్లాలవారీ చేయాలంటే ఆ జాబితాలను నవీకరించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.