రాష్ట్రీయం

ప్రాజెక్టులపై తప్పని జిఎస్టీ బరువు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 12: ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులపై జిఎస్‌టిని తగ్గించేందుకు కేంద్రంపై వత్తిడి తీసుకు రావడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 12శాతం జిఎస్‌టి కొనసాగుతుందని, తగ్గించే అవకాశం లేదని కేంద్రం రాష్ట్రానికి నచ్చజెప్పినట్టు తెలిసింది. ప్రాజెక్టులపై తొలుత 18 శాతం జిఎస్‌టి విధించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే ప్రాజెక్టుల నిర్మాణం ఎక్కువగా జరుగుతుందని దీని వల్ల తెలంగాణ నష్టపోతుందని కేంద్రానికి వివరించారు. దాంతో 18 శాతం నుంచి 12శాతానికి తగ్గించారు. ప్రాజెక్టులపై పనె్నండు శాతం జిఎస్‌టికి రాష్ట్రం సుముఖత వ్యక్తం చేసినా, ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను దీని నుంచి మినహాయించాలని కోరింది. దీనిపై ఇతర రాష్ట్రాలను కలుపుకొని న్యాయపోరాటం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. అయితే ఆన్ గోయింగ్ ప్రాజెక్టులపై 12శాతం జిఎస్‌టి విధించినా, దాని నుంచి రాష్ట్రానికి వాటా వస్తుందని, పెద్దగా భారం ఉండదని కేంద్రం నచ్చజెప్పినట్టు తెలిసింది. జిఎస్‌టి వల్ల తెలంగాణ వంటి రాష్ట్రానికి ఆదాయం పెరుగుతందని కేంద్రం వివరించినట్టు తెలిసింది. ఒక రాష్ట్రం ఒత్తిడి తీసుకు వస్తే మరో అంశంపై మరో రాష్ట్రం ఒత్తిడి తీసుకు వస్తుందని కేంద్రం భావిస్తోంది. ఇంతకు ముందు అమలులో ఉన్న పన్ను విధానంలో వచ్చిన ఆదాయం కన్నా రాష్ట్రానికి జిఎస్‌టి వల్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. జిఎస్‌టి కన్నా ముందు ప్రాజెక్టులపై ఐదుశాతం పన్ను ఉండేది. ఇప్పుడు జిఎస్‌టిలో దానిని 12 శాతానికి పెంచారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులపై జిఎస్‌టి తగ్గించే అవకాశం ఎంత మాత్రం లేదని కేంద్రం నుంచి
సమాచారం అందడంతో రాష్ట్రం మెత్తపడింది. ఈ అంశంపై ఉద్యమించాలని, న్యాయపోరాటం చేయాలని గతంలో భావించినా, కేంద్రం నుంచి అందిన సంకేతాల వల్ల వౌనంగానే ఉండిపోయారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులపై 12శాతం జిఎస్‌టి వల్ల దాదాపు 19వేల కోట్ల వరకు అదనపు భారం పడుతుందని తొలుత అంచనా వేశారు. అయితే జిఎస్‌టి రూపంలో వసూలు చేసే దానిలో రాష్ట్రానికి వాటా ఉంటుంది కాబట్టి రాష్ట్రంపై పెద్దగా భారం ఉండదని, జిఎస్‌టి వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని కేంద్రం వివరించింది. కేంద్రం నచ్చజెప్పడంతో ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులపై జిఎస్‌టి తగ్గడంపై తెలంగాణ ఆశ వదలుకొంది.