రాష్ట్రీయం

నెలాఖరులో పిఎస్‌ఎల్‌వి-సి39 ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఆగస్టు 12: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుంచి ఈ నెలాఖరులో పిఎస్‌ఎల్‌వి-సి 39 రాకెట్ ప్రయోగం జరిపేందుకు ఇస్రో శాస్తవ్రేత్తలు సన్నాహం చేస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపే ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ఉపగ్రహం బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రం నుంచి శనివారం రోడ్డు మార్గాన అత్యంత భారీ భద్రత నడుమ షార్‌కు చేరింది. ఇప్పటికే షార్‌లోని రెండో ప్రయోగ వేదిక వద్ద రాకెట్ అనుసంధాన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాకెట్ మూడు దశల అనుసంధాన పనులు పూర్తయిన తరువాత ఉపగ్రహాన్ని అమర్చి ప్రయోగానికి సిద్ధం చేయనున్నారు. ఇస్రో వర్గాల సమాచారం మేరకు ఈ నెల 31న రాకెట్ ప్రయోగం ఉండవచ్చని తెలుస్తోంది. ఏమైనా ఆలస్యం జరిగితే సెప్టెంబర్ రెండో వారంలో ప్రయోగం జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇస్రో నావిగేషన్ సిరీస్‌కు సంబంధించిన ఏడు ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. భవిష్యత్తు అవసరాల నిమిత్తం దిక్సూచి వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు మరో ఉపగ్రహాన్ని ఇస్రో పంపుతోంది.

చిత్రం.. షార్‌కు వెళ్తున్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహం