రాష్ట్రీయం

దేశవ్యాప్తంగా తెలుగుభాష అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 12: దేశవ్యాప్తంగా తెలుగు భాషాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడతానని చెప్పారు. కనీసం 20 శాతం మేర తెలుగును బతికిస్తే అది 80 శాతం మంది తెలుగు వారికి మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు.
మహామహోపాధ్యాయ ఆచార్య రవ్వా శ్రీహరి పంచ సప్తపతి మహోత్సవం సందర్భంగా శనివారం తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరిగిన రవ్వా శ్రీహరి సమగ్ర రచనల సాహితీ సమాలోచన కార్యక్రమానికి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు భాషను నేర్చుకుంటూ తెలుగుకు ప్రాధాన్యత పెంచాలని కంప్యూటర్‌లో కూడా తెలుగు భాష వాడకాన్ని పెంచాలని దత్తాత్రేయ అన్నారు. గురువులను సత్కరించడం మన సంప్రదాయమని, రవ్వా శ్రీహరి ఆదర్శవంతమైన సాహితీవేత్త అని, శిష్యులు ఆయనకు సత్కార మహోత్సవం చేసారని దత్తాత్రేయ కొనియాడారు. రవ్వా శ్రీహరి అసాధారణమైన వ్యక్తి అని సంస్కృత మానస పుత్రుడని కొనియాడుతూ 34 పుస్తకాలు, రెండు పదకోశాలు, నిఘంటువులు రాశారని రెండు తెలుగు రాష్ట్రాలకు అనేక గ్రంథాలు రాసారని దత్తాత్రేయ అన్నారు, సంస్కృత వారోత్సవాలను శ్రావణ మాసంలో జరపాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఎనిమిదో తరగతి వరకు తెలుగు నిర్బంధ విద్యగా బోధించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. విద్యార్థుల్లో కనీసం పది శాతం సంస్కృతాన్ని నేర్చుకున్నా తద్వారా 90 శాతం వ్యాప్తి చెందగలదని ఆయన అన్నారు. తెలుగు అభివృద్ధి కోసం ప్రధానమంత్రి మోదీతో మాట్లాడతానని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగును అమలు చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా రవ్వా శ్రీహరిని ఆయన శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎస్‌వి సత్యనారాయణ, తెలుగు అకాడమీ పూర్వ సంచాలకులు వెలిచాల కొండలరావు, కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు కోవెల సుప్రసన్నాచార్యులు, సీనియర్ పాత్రికేయులు కె.శ్రీనివాస్, ఆచార్య పిల్లలమర్రి రాములు పాల్గొనగా, కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమాన్ని తెలుగు అకాడమి మాజీ సంచాలకులు ఆచార్య కె.యాదగిరి సమన్వయం చేశారు.