రాష్ట్రీయం

అభివృద్ధి పనుల వేగాన్ని పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 12: తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులవేగాన్ని పెంచాల్సిన తక్షణావసరం ఉందని కార్మిక, ఉపాధి కల్పన శాఖల సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యక్రమాలను మరీ ముఖ్యంగా గృహ నిర్మాణం, ఆరోగ్యం, విద్య రంగాల్లో పనుల తీరుపై అధికారులతో సమీక్షించారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తోందని దానిని దృష్టిలో ఉంచుకుని నిర్ణీత వ్యవధిలో పనులుచేయాలని అన్నారు. తెలంగాణలో లక్షా 51వేల 155 ఇళ్లను మంజూరు చేసిందని, వీటిలో 70,674 ఇళ్లను 508 కోట్ల రూపాయిలతో గ్రామీణ ప్రాంతాలకు, 1207 కోట్లతో పట్టణ ప్రాంతాల్లో 80,481 ఇళ్లను మంజూరు చేశామని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో 32,091 ఇళ్లను మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. కాని రాష్ట్రప్రభుత్వం ఇంత వరకూ 1.39 లక్షల ఇళ్లకు మాత్రమే టెండర్లు ఆహ్వానించిందని, వీటిలో కేవలం 85వేల ఇళ్లకు మాత్రమే టెండర్లు ఖరారు చేసిందని వెల్లడించారు. అందులో 40వేల ఇళ్లకు మాత్రమే నిర్మాణ పనులు మొదలయ్యాయని వివరించారు. దక్షిణ మధ్య రైల్వే కరీంనగర్- ముంబై మధ్య ఒక కొత్త రైలును ప్రారంభిస్తుందని బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ఎంఎంటిఎస్ రెండో దశ పూర్తికావడంతో 2018డిసెంబర్‌కు రాష్ట్రప్రభుత్వం భూమిని సమకూర్చడంతో పాటు నిధులను కేటాయించాల్సి ఉంటుందని అన్నారు. ఇంత వరకూ రాష్ట్రప్రభుత్వం ఈ పథకానికి కేవలం 60 కోట్ల రూపాయిలు విడుదల చేసిందని అన్నారు. భూ సమస్యలు ఏమైనా ఉంటే రక్షణ మంత్రితో తాను చర్చిస్తానని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పైన భారం తగ్గించడానికి చర్లపల్లి- నాగులపల్లి స్టేషన్‌లను పెద్ద స్టేషన్‌లుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యాబోధన నాణ్యత విషయంలో హైదరాబాద్ జిల్లా అట్టడుగున ఉందని, పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుందని అన్నానరు. అలాగే ప్రధాన ఆస్పత్రుల్లో వౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, కాంట్రాక్టు కార్మికులకు తక్కువ వేతనాలు ఇస్తున్నారని, ఇటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాల్సి ఉందని అన్నారు. బిజెపి ఎమ్మెల్యే జి కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జిఎం వినోద్‌కుమార్ యాదవ్ ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.