రాష్ట్రీయం

నాది గోల్డెన్ లెగ్.. గెలుపు మాదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 12: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఏ సిద్ధాంతం లేదని ఎఐసిసి కార్యదర్శి, పార్టీ వ్యవహారాల నూతన ఇన్‌ఛార్జి ఆర్‌సి కుంతియా విమర్శించారు. ఒకటి, రెండు నెలల్లో మా పార్టీ సత్తా ఏమిటో చూపిస్తామని ఆయన తెలిపారు. టి.కాంగ్రెస్‌కు ఇన్‌ఛార్జిగా నియమితులైన తర్వాత శనివారం హైదరాబాద్ చేరుకున్న కుంతియాకు శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో కార్యకర్తలు బాణాసంచా కాల్చి స్వాగతించారు. ఈ సందర్భంగా కుంతియా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణను ఆదివారం జరగబోయే పార్టీ ముఖ్య నేతల సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మీ సిద్ధాంతం ఏమిటని ప్రశ్నించండి, ఏమని సమాధానం వస్తుందో చూడండి అని ఆయన మీడియా ప్రతినిధులను ఉద్దేశించి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లోనే గెలుపొందుతుందని సిఎం వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా, ఆయనకు అంతగా నమ్మకం ఉంటే ఫిరాయింపుదారులైన ఎంపీలు, ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ గెలవమనండి అని కుంతియా సవాలు చేశారు.
టార్గెట్ 2019
పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోనున్నామని, పోలింగ్ కేంద్రం నుంచి మొదలుకుని రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలపై దృష్టి సారిస్తామన్నారు. రాష్ట్రంలోని 550 మండలాల్లో పర్యటిస్తామని, తానూ విస్తృతంగా పర్యటిస్తానని ఆయన చెప్పారు.
ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సందేశ్ యాత్ర పేరిట రాష్టమ్రంతా సుడిగాలి పర్యటన చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వంపై చార్జిషీట్‌ను ప్రజల ముందుంచుతామన్నారు. నేరెళ్ళలో దళితులను హింసించిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు (ఎన్‌హెచ్‌ఆర్‌సి) ఫిర్యాదు చేశామన్నారు.
పార్టీలో క్రమశిక్షణ..
పార్టీలో క్రమశిక్షణ అవసరమని ఆయన చెప్పారు. ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అందరూ కలిసి పని చేయాలని ఆయన సూచించారు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలకూ పార్టీ పదవుల్లో ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. తాను తాత్కాలిక ఇన్‌ఛార్జినేనన్న ప్రచారంలో వాస్తవం లేదని, ఫుల్ ఛార్జితో వచ్చానని ఆయన తెలిపారు. టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని మార్చే ఆలోచన లేదని కుంతియా చెప్పారు. ఉత్తమ్, జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితర నాయకుల అధ్వర్యంలోనే ఎన్నికలకు వెళతామని అన్నారు. తాను నాయకునిగా కాదు కార్యకర్తగా వచ్చానని ఆయన తెలిపారు.
తనది గోల్డెన్ లెగ్ అని ఆయన తెలిపారు. లోగడ ఒరిస్సా, కర్నాటక తదితర రాష్ట్రాలకు ఇన్‌చార్జిగా వెళ్ళానని, ఆయా రాష్ట్రాల్లో పార్టీ ఘన విజయం సాధించిందన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు వ్యతిరేకం అనే భావన ప్రజల్లో ఉన్నందున టిఆర్‌ఎస్ విజయానికి దోహదపడిందన్నారు. సోనియా వల్ల తెలంగాణ వచ్చిందని ప్రచారం చేసుకోలేకపోయామని ఆయన తెలిపారు.