తెలంగాణ

కిక్కిరిసిన టోల్‌గేట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జనవరి 13: సంక్రాంతి పండుగ పర్వదినం వేడుకల్లో పాల్గొనేందుకు పొరుగు రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద ఎత్తున ప్రజలు తరలివెళ్తుండఆంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లాలో వాహనాల రద్దీ బుధవారం సాయంత్రం మరింత పెరిగింది. ఈ నెల 14, 15, 16 తేదీలలో జరుగుతున్న సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు వేల సంఖ్యలో ప్రజలు ఆంధ్రకు పయనమవడంతో హైవేపై అడుగడుగునా ట్రాఫిక్ జామ్ అవుతోంది. జాతీయ రహదారిపై వాహనాలు బారులుతీరి వెళ్తున్నాయి. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీస్ ఇన్స్‌పెక్టర్ నవీన్‌కుమార్ సారథ్యంలో జాతీయ రహదారిపై బందోబస్తు ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ నిర్వహిస్తూ ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు సుగమం చేస్తున్నారు. చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు జామ్ కాకుండా జిఎంఆర్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వాహనాలను వరుస క్రమంలో పంపించేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు ఎనిమిది, విజయవాడ వైపు, ఎనిమిది టోల్‌వేలు ఉండగా విజయవాడ వైపు 12 టోల్‌వేలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలకు నాలుగు వేలను ఏర్పాటు చేశారు. వాహనాల సంఖ్య పెరిగితే మరిన్ని టోల్‌వేలను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. రోజువారిగా జాతీయ రహదారిపై సుమారు 17 వేల వాహనాలు వెళ్తుంటాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బుధవారం సుమారు 25 వేలకు పెరిగింది. మరింత పెరిగే అవకాశాలున్నాయి. అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చౌటుప్పల్ పట్టణంలో అడుగడుగునా ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి వెంట తంగడపల్లి చౌరస్తా వద్ద రోడ్డు దాటకుండా ఉండేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసులను నియామకం చేశారు. అయినప్పటికీ ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంక్రాంతి పయనంతో హోటళ్లు, పెట్రోల్ బంకులు, చిరువ్యాపారులకు గిరాకీ పెరిగింది.

పంతంగి టోల్‌ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు