రాష్ట్రీయం

డిజిపి రేసులో ఆరుగురు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ నవంబర్ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలకే పదవీ విరమణ చేయాల్సి ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మీద యుపిఎస్‌సి, కేంద్ర హోంశాఖ పదవీ కాలాన్ని 9 నెలలు పొడిగించింది. మూడు నెలల్లో పదవీ విరమణ చేయనున్న అనురాగ్‌కు మరోసారి పదవీ కాలం పొడిగించాలని ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. అయతే ప్రతిపాదనను కేంద్రం ఆమోదించే అవకాశాలు తక్కువే. ప్రస్తుతం డిజిపి ర్యాంకు హోదా ఉన్న ఆరుగురు ఐపీఎస్‌లు డిజిపి స్ధానం కోసం పోటీపడుతున్నారు. ఈసారి ఎవరు డిజిపిగా ఎంపికైనా వారు 2019 ఎన్నికల వరకు కొనసాగే అవకాశం ఉంది. డిజిపి హోదా ఉన్న ఆరుగురు సీనియర్ ఐపిఎస్‌లలో తేజ్‌దీప్ కౌర్ మీనన్, సుదీప్ లక్టాకియా, రాజీవ్ త్రివేది, ఎం మహేందర్ రెడ్డి, పభాకర్ అలోక్, టి కృష్ణప్రసాద్ ఉన్నారు. వీరీలో తేజ్‌దీప్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిజిగా, సుదీప్ లక్టాకియా సిపిఆర్‌ఎఫ్ డిజిగా, మహేందర్ రెడ్డి నగర పోలీసు కమిషనర్‌గా, అలోక్ ప్రభాకర్ ఇంటెలిజెన్స్ బ్యూరో అదనపు డైరెక్టర్‌గా, రోడ్ సెఫ్టీ రైల్వే పోలీసు డిజిపిగా టి కృష్ణప్రసాద్ ఉన్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం డిజిపి పోస్టుకు అర్హత ఉన్నవారి జాబితాను యుపిఎస్‌సికి పంపిస్తుంది. యుపిఎస్‌సి వీరిని సీనియారిటీ ప్రాతిపదికను నియమిస్తుంది. ఒకసారి డిజిపి పోస్టులో నియమితులైన వారు 60 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ కావాలన్న నిబంధనతో నిమిత్తం లేకుండా రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.