రాష్ట్రీయం

ఒడిశా సమీపంలో అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 18: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశాను ఆనుకుని అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం శుక్రవారం రాత్రి తెలియచేసింది. దీంతోపాటు ఒడిశా నుంచి ఏపి, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావం వలన తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపిలో రాగల 24 గంటల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలియచేశారు. ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.